Breaking News: జాబ్ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నిన్న చాలా గంటలల పాటు సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాత్రి ప్రగతి భవన్‌లోనే ప్రశాంత్ కిషోర్ బస చేశారని, నేడు సైతం మరిన్ని అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, బస్సులోని 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి పట్టణం అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై శనివారం రాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ?
జగన్ ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ట్రావెల్స్ బస్సును దామరచర్ల సమీపంలో హై స్పీడ్ లో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌టెక్ చేయబోయాడు. పరిస్థితి గమనించిన ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ ను వారించారు.
గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 24th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 24th April 2022) లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ లీటర్ ధర రూ.106.80 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 83 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో కేవలం ఉత్తర కోస్తాంధ్రను మినహాయిస్తే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎండలు మండిపోతాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండగా.. మిగతా ప్రాంతాల్లో భానుడి ప్రతాపానికి ప్రజలు తట్టుకోలేరు అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు.
Job Notificationsపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసి 45 రోజులు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా ఎన్ని ఏళ్ళు ఆపగలరు, మీ కొడుకులాగే తెలంగాణ బిడ్డలను మీరు భావించాలి కదా.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు.
Peddapalli Road Accident: డీసిఎం వ్యాన్, కారు ఢీ - ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
Peddapalli Road Accident: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద డీసిఎం వ్యాన్, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.





















