Kartavya Path: కర్తవ్యపథ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ, నేతాజీ విగ్రహావిష్కరణ కూడా
Kartavya Path: ఢిల్లీలో రాజ్‌పథ్ స్థానంలో కొత్తగా నిర్మించిన కర్తవ్యపథ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Kartavya Path:
రాచరికపు ఆనవాళ్లు లేకుండా..
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే...ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి "కింగ్స్ వే" పేరుతో కొనసాగుతున్న దారిని ఇప్పుడు కర్తవ్య పథ్ పేరుతో ముస్తాబు చేశారు. రైసీనా హిల్స్‌పై రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల మేర ఉన్న రాజ్‌పథ్..ఇకపై కర్తవ్య పథ్‌గా మారనుంది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజల సాధికారతకు ప్రతీక అని కేంద్రం స్పష్టం చేసింది. అమృత కాల్‌లో భాగంగా...ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన పంచ ప్రాణ్ ప్రణాళికల్లో "రాచరికపు ఆనవాళ్లను నిర్మూలించటం" కూడా ఒకటి. అందుకే...బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌కు కర్తవ్య పథ్
అని పేరు పెట్టారు. గణతంత్ర దినోత్సవం సహా..మరికొన్ని జాతీయ కార్యక్రమాలు రాజ్‌పథ్‌లో నిర్వహిస్తుంటారు. దీని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు కర్తవ్య పథ్‌తో ఆ సమస్య కూడా తీరిపోతుందని కేంద్రం వివరిస్తోంది. రాజ్‌పథ్‌కు సంబంధించిన మరి కొన్ని సమస్యల్నీ పరిగణనలోకి తీసుకుని...కర్తవ్య పథ్‌ను నిర్మించారు. రాజ్‌పథ్ మార్గంలో విజిటర్స్ ఎక్కువగా వస్తుండటం వల్ల ట్రాఫిక్ పెరుగుతోంది. పక్కనే ఉన్న సెంట్రల్ విస్టాకూ తాకిడి ఎక్కువవుతోంది. ఫలితంగా...అక్కడి మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. పబ్లిక్ టాయ్‌లెట్స్, తాగునీటి వసతులు చాలటం లేదు. పార్కింగ్ స్పేస్ కూడా సరిగా లేదు. ఈ సమస్యలన్నీ తీర్చే విధంగా కొత్త కర్తవ్య పథ్‌ను నిర్మించారు.
Beautiful views.
— Ashish Kumar (@IndAshish99) September 8, 2022
PM Shri @narendramodi to unveil the new #CentralVistaAvenue today along with statue of #NetajiSubhashChandraBose and inaugurate the #KartavyaPath.#NewIndia #TransformingIndia@Bjpmofficial @rohitTeamBJP @BJP4Delhi @santoshojha @Shehzad_Ind pic.twitter.com/zi8JX3BPjw
Bound by Duty to India!
— Sarbananda Sonowal (@sarbanandsonwal) September 7, 2022
New India's Kartavya Path. #CentralVistaAvenue pic.twitter.com/7p6iFvOh60
Statue of Subhash C Bose getting installed at the India Gate, Central Vista in New Delhi on Wednesday. Photo © Tashi Tobgyal/ @IndianExpress #CentralVista #KartavyaPath pic.twitter.com/enqiHwm42I
— Tashi Tobgyal (@tashitobgyal) September 7, 2022
ఎన్నో ప్రత్యేకతలు..
కర్తవ్యపథ్‌లో అందమైన లాన్‌లు, వాక్‌వేస్, గ్రీన్ స్పేసెస్, చిన్న కాలువలు ఏర్పాటు చేశారు. పాదచారులకు ప్రత్యేకంగా అండర్‌పాస్‌లతో పాటు వాహనదారులకు పార్కింగ్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. నైట్ లైటింగ్‌లోనూ మార్పులు చేర్పులు చేశారు. రాత్రి పూట కూడా ఈ దారంతా అందంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో పాటు వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు, రీసైక్లింగ్ ఆఫ్ యూజ్డ్ వాటర్ సహా మరి కొన్ని ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఈ కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన తరవాత...నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ప్రధాని మోదీ. 28 అడుగులు ఈ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. దీని బరువు 65 మెట్రిక్ టన్నులు. ఈ ఏడాది జనవరి 23న పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్కడైతే సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారో... అక్కడే... ఇప్పుడు అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దీన్ని గ్రానైట్‌తో తయారు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ చేసిన కృషికి గౌరవ సూచకంగా...ఈ విగ్రహం తయారు చేయించారు.
Also Read: Amit Shah Mumbai visit: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం- ఆంధ్రా ఎంపీ సెక్రటరీ అరెస్ట్!