అన్వేషించండి

PM Modi Oath Ceremony: 1947లో నెహ్రూ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు? అప్పటి నుంచి ఈ వేడుకలో వచ్చిన మార్పులివే!

PM Modi Oath Ceremony: 1947లో తొలిసారి నెహ్రూ రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

PM Modi Swearing In: ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత కీలకమైంది. ఓ నేతను ఎన్నుకున్న తరవాత రాజ్యాంగ బద్ధంగా ఆయన ఆ పదవిని చేపట్టాలంటే అందరి ముందు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయి అయితే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ప్రధాన మంత్రి స్థాయి అయితే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. అయితే...ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. బ్రిటీష్‌ వాళ్లు భారత్‌లో పరిపాలించినప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. అప్పట్లో అధికారులు తమ బాధ్యతలు తీసుకునే ముందు రాజుపై విశ్వాసం చూపించుకునేందుకు ఈ ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన (history of oath taking ceremonies) తరవాత కూడా ఇది కొనసాగుతూ వస్తోంది. కాకపోతే ఇప్పుడు మన దేశ రాజ్యాంగం సాక్షిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. 1947లో ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర భారత తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత ఈ దర్బార్‌ హాల్‌లోనే ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీగా వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. 

PM Modi Oath Ceremony: 1947లో నెహ్రూ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు? అప్పటి నుంచి ఈ వేడుకలో వచ్చిన మార్పులివే!

1990 తరవాత ఈ ప్రక్రియలో కొన్ని మార్పులు జరిగాయి. అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 1990లో ప్రధానిగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు దర్బార్‌ హాల్‌లో కాకుండా రాష్ట్రపతి భవన్‌ ముందున్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేయించారు. దర్బార్‌ హాల్‌ ఇరుకవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు. ఎక్కువ మంది అతిథులను పిలిచినప్పుడు అందరికీ కనిపించేలా ప్రధాని ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ఇలాగే రాష్ట్రపతి భవన్ ముందున్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగింది. 2014,2019లో నరేంద్ర మోదీ కూడా ఈ విధానాన్నే అనుసరించారు. వేలాది మంది అతిథులను పిలిచారు. 2014లో 4 వేల మంది, 2019లో 6 వేల మంది అతిథులు రాగా ఈ సారి ఆ సంఖ్య 8 వేలకు పెరిగింది. 1984లో తొలిసారి ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో  ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 100 కెమెరాలతో బ్రాడ్‌కాస్ట్ చేయనున్నారు. 8 వేల మంది అతిథులకు తగ్గట్టుగానే రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 1,100 వందల మంది ట్రాఫిక్ పోలీసులు నగరాన్ని మొహరించారు. 7 దేశాల అధినేతలు వస్తుండడం వల్ల పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 

Also Read: PM Modi Salary: ప్రధాని నరేంద్ర మోదీ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget