ఈ ఏడాది ఆనందంతో నిండిపోవాలి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల న్యూ ఇయర్ విషెస్
New Year 2024: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్ మీడియా వేదికగా న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
New Year Wishes 2024:
కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
2023 కి గుడ్‌బై చెప్పి 2024కి అంతా గ్రాండ్ వెల్‌కమ్ (Happy New Year 2024) చెప్పారు. కొత్త ఆశలతో న్యూ ఇయర్‌ని స్వాగతించారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. సోషల్ మీడియా కూడా ఈ విషెస్‌తో (New Year Wishes) నిండిపోతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా మరి కొందరు ప్రముఖులు X వేదికగా కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ప్రజలందరూ సంతోషంగా ఉండాలని,శాంతి వెల్లివిరియాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్ష వ్యక్తం చేశారు.
"అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నాను. సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఈ స్ఫూర్తితో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం"
- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
Warm New Year greetings to all! May the Year 2024 bring happiness, peace and prosperity for everyone. Let us welcome the New Year with a renewed commitment to contribute to inclusive and sustainable development.
— President of India (@rashtrapatibhvn) January 1, 2024
ప్రధాని నరేంద్ర మోదీ కూడా X వేదికగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ ఆరోగ్యంతో పాటు సంతోషం కలగాలని ఆకాంక్షించారు.
"అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు సంతోషంతో పాటు శాంతినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
Wishing everyone a splendid 2024! May this year bring forth prosperity, peace and wonderful health for all.
— Narendra Modi (@narendramodi) January 1, 2024
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ ఏడాది పేద ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. ప్రతి పౌరుడూ తమ హక్కుల కోసం పోరాడాలని, సామాజిక న్యాయం జరగాలని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. X వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు.
नया साल आप सभी के जीवन में खुशियां और समृद्धि की सौगात और भारत में न्याय और मोहब्बत का पैगाम ले कर आए।
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023
Wishing everyone a very happy and prosperous New Year 2024. pic.twitter.com/PH2sAQ4Rcb
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కర్ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. భారత దేశ అభివృద్ధికి అంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
Greetings to every Indian for the New Year 2024!
— Vice President of India (@VPIndia) January 1, 2024
May the New Year bring in peace, prosperity and happiness to each and everyone.
Let us embrace the dawn of the #NewYear with a resolute commitment to contribute towards wholesome progress and prosperity of Bharat.