Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!
Sachin Pilot On PM Modi: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ మరోసారి విమర్శలు చేశారు.
![Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్! PM Modi Praised Ghulam Nabi Azad In Same Way Sachin Pilot On PM Modi Praising Gehlot Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/27/85e22b829a5ade68259128e1da8575391664278679963538_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sachin Pilot On PM Modi: రాజస్థాన్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు చేశారు. సీఎం గహ్లోత్‌ను ప్రధాని మోదీ ప్రశంసించడాన్ని అంత తేలికగా తీసుకోకూడదని పైలట్ అభిప్రాయపడ్డారు.
#WATCH | Rajasthan Cong MLA Sachin Pilot says, "...I find the heaps of praises by PM Modi (on CM Gehlot y'day)very interesting. PM had similarly praised GN Azad in Parliament. We saw what happened after that. It was an interesting development y'day. Shouldn't be taken lightly..." pic.twitter.com/QBknOLVWJT
— ANI (@ANI) November 2, 2022
ఇదీ జరిగింది
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్.. ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం ప్రశంసించారు. అయితే దాని వెనకాల సెటైర్ కూడా ఉంది. గాంధీ దేశానికి ప్రధాని అయినందుకే మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయనకు గొప్ప గౌరవం లభిస్తుందని అశోక్ గహ్లోత్ అన్నారు.
రాజస్థాన్ బాన్సవారా జిల్లాలోని మంగఢ్ హిల్‌పై నిర్వహించిన 'మంగఢ్ ధామ్ కి గౌరవ్ గాథా' కార్యక్రమం వేదికపై గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
మోదీ ఏమన్నారు?
ఈ కార్యక్రమంలో ట్రైబల్ కమ్యూనిటీ పోరాటం, త్యాగాలను మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత ట్రైబల్ కమ్యూనిటీలకు చరిత్రలో సరైన స్థానం లభించలేదన్నారు. అలాంటి దశాబ్దాల కాలం నాటి తప్పులను తాము సవరిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గహ్లోత్ గురించి కూడా మోదీ మాట్లాడారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)