Top Headlines Today: ఆ పదవిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తి చూపారా? తెలుగు కేంద్ర మంత్రులకు రేవంత్ ఓ విజ్ఞప్తి
AP Telangana Latest News 10 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today: ఆ పదవిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తి - ఆ వార్తల్లో నిజమెంత? - ఏపీలో కూటమి 164 అసెంబ్లీ స్థానాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అనంతరం మంత్రులకు కేటాయించే శాఖలపైనా ఆయన ఫోకస్ చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, కూటమిలో భాగంగా జనసేన పోటీల చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంత్రివర్గంలోకి పవన్ వెళ్తారా.? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అలా చేయండి -తెలుగు కేంద్ర మంత్రులకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి
కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అమరావతిపై కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం- కళకళలాడుతున్న రాజధాని
వంద పొక్లయిన్‌లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కళకళలాడుతోంది. ఐదేళ్లుగా పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండు రోజుల్లో కొలువు దీరనుంది. ఈ లోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడు రాజధానులతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో కంప చెట్లు పేరుకుపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిని తలపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కర్నూలు నుంచి మంత్రియోగం ఎవరికి ? సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తారా ?
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సీమ జిల్లాల్లో సైతం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఊహించని స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కందనవోలు లో తెలుగు తమ్ముళ్లు రాజకీయ కదనరంగంలో తెలుగుదేశం పార్టీ కి కనివిని ఎరుగని స్థానాలలో విజయం సాధించారు. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని చూపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా!
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మొదటగా నరేంద్ర మోదీతో, అనంతరం ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి