PM Kisam Samman : పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విఢుదల - మెసెజ్ రాకపోతే ఇలా చెక్ చేసుకోండి
Modi Kisan : పీఎం కిసాన్ పథకంలో భాగంగా పదిహేడో విడత నగదును ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. వారణాశి లో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కారు.
PM Kisan cash : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధుల జమ ప్రారంభించారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఫస్ట్ సంతకం పీఎం కిసాన్ నిధులపై చేశారు. ఈ స్కీం ద్వారా మొత్తం 9 కోట్ల 26లక్షల మంది రైతుల ఖాతాల్లో 20వేల కోట్ల రూపాయలను జమ చేశారు.
ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేల ను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు ఇస్తారు. ఇప్పటి వరకు 16 విడతలుగా అన్నదాతల ఖాతాల్లో రూ.32 వేలు జమ చేశారు. పీఎం కిసాన్ యోజన పథకం నుంచి లబ్ధి పొందాలంటే.. రైతులు తప్పనిసరిగా ఇ కేవైసీ చేసుకోవాలి. ఇ కేవైసీ చేసుకుంటేనే రైతులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఇ కేవీసీ చేసుకోకుంటే.. చేసుకోవచ్చు. దాని కోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో చేసుకోవాలి. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. వెబ్ సైట్ లో లబ్ధిదారుల లిస్ట్ ఉంటుంది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కూడా చేసుకోవచ్చు.
#WATCH | Uttar Pradesh: During PM Kisan Samman Sammelan in Varanasi, Prime Minister Narendra Modi says "PM Kisan Samman Nidhi has become the world's largest Direct Benefit Transfer scheme. So far, Rs 3.25 lakh crore has been deposited in the bank accounts of crores of farmer… pic.twitter.com/DK6ClghqF9
— ANI (@ANI) June 18, 2024
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్‌కి మెసేజ్ రానుంది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేయని వారిని ఈ జాబితా నుంచి తొలగించారు. అంతే కాదు సరైన పత్రాలు లేకపోయినా, చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది రైతులకు ఈ సాయం ఖాతాల్లో జమ అవుతోంది. ఈ కేవైసీ సమస్యల వల్ల ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని మిస్ అవుతున్నారు. ఈ కేవైసీ చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు సాయం చేసే పథకాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడి సాయం పథకం, ఏపీలోనూ రైతు భరోసా అమలు చేస్తున్నారు. అయితే రైతు భరోసాని పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తున్నారు. వైసీపీ ఓడిపోవడంతో చంద్రబాబు అమలు చేయబోయే పథకంపై స్పష్టత రావాల్సి ఉంది.