Boring Job : పారిస్‌లో అసలైన సుడిగాడు ! పని చేయించుకోకుండా జీతం ఇచ్చారని కంపెనీపై కేసు.. అక్కడా రూ.33 లక్షలు వెనకేశాడు !
పని చెప్పకుండా జీతం ఇచ్చారని ఓ ఉద్యోగి కంపెనీపై కేసు పెట్టారు. తనను అవమానించారన్నాడు. దానికి పరిహారంగా రూ. 33 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మల్లీశ్వరీ సినిమాలో బ్యాంక్ మేనేజర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. క్యాషియర్ పనితీరుపై అసహనం చెంది.. " నువ్ రేపట్నుంచి బ్యాంక్‌కే రావొద్దు.. జీతం ఇంటికే పంపిస్తాను" అని ఆఫర్ ఇస్తాడు. ఇలాంటి ఆఫర్ ఇస్తే ఏ ఉద్యోగి అయినా ఎగిరి గంతేస్తాడు. అయితే అలాంటి వాళ్లంతా నార్మల్ పీపుల్. లెజెండ్స్ మాత్రం వేరే ఉంటారు. ఈ లెజెండ్స్ అలా కూర్చోబెట్టి జీతం ఇచ్చినందుకు కూడా మళ్లీ యజమాని నుంచి నష్టపరిహారం వసూలు చేస్తారు. పారిస్‌లో ఈ లెజెండ్ ఒకరు వెలుగులోకి వచ్చారు.
Also read: రోజుకు రెండు స్పూనుల నువ్వులు... బరువు తగ్గించడమే కాదు, గుండెపోటునూ అడ్డుకుంటాయి
పారిస్‌లో ఫ్రెడరిక్ డెస్‌నార్డ్ అనే వ్యక్తి ఓ ప్రముఖ పర్‌ఫ్యూమ్ తయారీ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ ఉంటారు. తాను ఎంతో క్రియేటివ్ పర్సనని ఆయన ఫీలింగ్. ఆయన క్రియేటివిటీ దెబ్బకు ఓ సారి అత్యంత ముఖ్యమైన క్లయింట్‌ను కంపెనీ కోల్పోయింది. ఇంకా ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తే కంపెనీని ఎక్కడ మూసుకోవాల్సి వస్తుందోనని కంగారు పడిన యాజమాన్యం.. ఆయనను వేరే పొజిషన్‌కు మార్చింది. ఆ పొజిషన్ ఏంటంటే.. అసలు పనేమీ లేకుండా కూర్చోవడం. కానీ జీతం.. అలవెన్సులు.. ఇంక్రిమెంట్లు అన్నీ అందరితో పాటే ఇస్తూ చక్కగా చూసుకుంది.
అయితే ఖాళీగా కూర్చుని కూర్చుని.. ఫ్రెడరిక్‌కు మాత్రం చిర్రెత్తిపోయింది. తనలాంటి ఓ జీనియస్‌ను ఖాళీగా కూర్చోబెట్టి జీతం ఇస్తూ అవమానిస్తున్నారని.. అంతే కాక టాలెంట్‌ను తొక్కేస్తున్నారని భావించి కోర్టుకెళ్లాడు. ఏం చేయకుండే డబ్బులు తీసుకుంటున్నందుకు సిగ్గుగా ఉందని తన మీద కంపెనీ చెడు ముద్ర వేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. ఆయన ఆవేదన అర్థం చేసుకున్న కోర్టు రూ. 33 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Also read: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన టాంజానియా పిలగాడు, అతడు ఎంత పాపులర్ అంటే...
అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తే ఎక్కడ ఇబ్బందిపడతాడోనని కంపెనీ యాజమాన్యం భావించి.. జాలి చూపించిందేమో కానీ ఇప్పుడు అది వారి మెడకు చుట్టుకుంది. భారీ నష్టపరిహారం చెల్లించక తప్పలేదు.
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్