News
News
X

Pakistan Economic Crisis: పాక్‌ ప్రజల ఆకలి తీర్చేందుకు ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్లాన్, జైలుకు పంపాలంటూ సూచన

Pakistan Economic Crisis: పాక్ ప్రజల ఆకలి తీర్చేందుకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్లాన్ చెప్పారు.

FOLLOW US: 
Share:

Pakistan Economic Crisis:

జైల్లో టైమ్‌కి తినొచ్చు: ఇమ్రాన్ ఖాన్ 

పాకిస్థాన్ సంక్షోభం ముదురుతోంది. తిండికి తిప్పలు పడుతున్నారు అక్కడి ప్రజలు. మాకు సాయం చేయండి అంటూ ప్రతి దేశాన్నీ అర్థిస్తోంది దాయాది. రోజుకు రెంజు సార్లు బ్రెడ్‌ కొనేందుకూ నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ ప్రధాని 
ఇమ్రాన్ ఖాన్ జైల్ భరో ఉద్యమం మొదలు పెట్టారు. పాకిస్థాన్ తెహరీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆహారం కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రజలందరినీ జైళ్లకు పంపాలన్నదే ఈ ఉద్యమం ఉద్దేశం. జైల్లో పెడితే కనీసం టైమ్‌కి బ్రెడ్‌కి దొరుకుతుందన్నది ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఆలోచన. బయట అలా ఆహారం కోసం ఆందోళనలు చేసే బదులు జైల్లో ఉంటూ సమయానికి తిండి తినడం బెటర్ కదా అంటున్నారు ఇమ్రాన్. ఆకలికి తట్టుకోలేక కొందరు గోధుమ పిండిని దొంగిలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇమ్రాన్‌ ఖాన్ స్ట్రాటెజీ చాలా బాగుందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే తిండి లేక అల్లాడుతుంటే పాక్‌లోని సంపన్న కుటుంబాలు తమ పెంపుడు కుక్కలు, పిల్లులకు ఆహాకరం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. కేబినెట్‌ మంత్రుల జీతాలకు కోత విధించి షెహబాజ్ ప్రభుత్వం. కానీ సంపన్న వర్గాలు మాత్రం తమ పెట్ డాగ్స్‌కి ఫుడ్ కావాలంటూ డిమాండ్ చేస్తుండటం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. అయితే...ప్రభుత్వం "మా వల్ల కాదు" అని తేల్చి చెప్పింది. పాక్‌లో ఫుడ్ దొరకడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న సంపన్న వర్గాలు విదేశాల నుంచి ఆహారం తెప్పించుకుంటున్నారు. 

కట్టడి చర్యలు..

పాకిస్థాన్‌లోని ఆర్థిక సంక్షోభం సాధారణ ప్రజల్నే కాదు. మంత్రుల్ని కూడా ఇబ్బందులు పెడుతోంది. వాళ్లూ సొంత ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల్లోనూ కోతలు తప్పడం లేదు. మంత్రులెవరైనా సరే ఇకపై విమాన ప్రయాణం చేయాల్సి వస్తే బిజినెస్ క్లాస్‌లో వెళ్లడానికి వీల్లేదు. అంతే కాదు. ఫైవ్ స్టార్‌ హోటళ్లలోనూ స్టే చేయడానికి అవకాశం లేదు. శాలరీల్లోనూ కోతలు విధించి ఇస్తున్నారు. 6.5 బిలియన్ డాలర్ల IMF బెయిల్ అవుట్‌ దక్కాలంటే...కాస్ట్ కట్టింగ్ తప్పదు. అందుకే ఇలా వీలైనంత వరకూ ఖర్చులు తగ్గించుకుంటోంది పాక్ ప్రభుత్వం. ఇప్పటికే 764 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియ ఇక్కడితే ఆగేలా లేదు. మరి కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. జులైలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ పద్దులోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటించనుంది. ఇదే విషయాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఇంతకు మించి చేసేదేమీ లేదని స్పష్టం చేశారు. "ఇదొక్కటే తక్షణ పరిష్కారం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మేం కొన్ని త్యాగాలు చేయక తప్పడం లేదు" అని అన్నారు షెహబాజ్. ప్రస్తుతం పాక్ వద్ద 3 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి మరి కొద్ది వారాల్లో ఖర్చైపోతాయి. ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా దేశం ఆర్థికంగా మరింత బలహీనపడిపోయింది. ఆహార కొరత వేధిస్తోంది. ద్రవ్యోల్బణం 30%కి పెరిగింది. 

Also Read: Congress Plenary Session: నా పొలిటికల్ ఇన్నింగ్స్‌ ఇక ముగుస్తుందేమో, కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు - సోనియా గాంధీ

 

Published at : 25 Feb 2023 03:08 PM (IST) Tags: Pakistan Imran Khan Jail Bharo Pakistan Crisis Pakistan Economic Crisis

సంబంధిత కథనాలు

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?