Congress Plenary Session: నా పొలిటికల్ ఇన్నింగ్స్ ఇక ముగుస్తుందేమో, కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు - సోనియా గాంధీ
Congress Plenary Session:భారత్ జోడో యాత్రతోనే తన రాజకీయ జీవితం ముగిసినట్టుగా భావిస్తున్నట్టు సోనియా గాంధీ అన్నారు.
Congress Plenary Session:
ప్లీనరీ సమావేశం..
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు.
"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
Our victories in 2004&2009 along with the able leadership of Dr Manmohan Singh gave me personal satisfaction but what gratifies me most is that my innings could conclude with the Bharat Jodo Yatra, a turning point for Congress: Cong MP & UPA chairperson Sonia Gandhi in Raipur https://t.co/EPG2ByMUrf pic.twitter.com/irStn2XzPY
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
This is a challenging time for Congress & the country as a whole. BJP-RSS has captured and subverted every single institution in the country. It has caused economic ruin by favouring a few businessmen: Cong MP & UPA chairperson Sonia Gandhi in Raipur, Chhattisgarh pic.twitter.com/ad4JQ3cFrd
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపించిన తీరుని ప్రశంసించారు సోనియా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనూ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని అన్న సోనియా గాంధీ...కాంగ్రెస్ కేవలం పార్టీ మాత్రమే కాదని, ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావు ఉందని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు. దేశమే సవాలు ఎదుర్కొంటున్న సమయం. దేశంలోని ప్రతి సంస్థను బీజేపీ ఆర్ఎస్‌ఎస్ హస్తగతం చేసుకున్నాయి. కేవలం కొందరు బడా వ్యాపారుల కోసం ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు"
- సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
CPP chairperson Sonia Gandhi also said she was happy that her "innings could conclude with the Bharat Jodo Yatra". The yatra has come as turning point. It has proved that ppl of India overwhemly wants harmony, tolerance & equality. @TheNewIndian_in pic.twitter.com/hotYkbNcxR
— Anand Singh (@Anand_Journ) February 25, 2023
Also Read: Kerala School Students: పేద కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు, పెద్ద మనసు చాటుకుంటున్న విద్యార్థులు - అలెప్పీ కలెక్టర్ వినూత్న ఆలోచన