అన్వేషించండి

9 Sim Cards : మీ పేరు మీద 9కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే కష్టమే ! ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి !

దేశంలో ఎవరికైనా 9 సిమ్‌ల వరకే అనుమతి ఉంటుంది. అంత కంటే ఎక్కువ ఉంటే డిస్‌కనెక్ట్ చేస్తారు. విచారణ చేస్తారు.

సెల్ ఫోన్లు మార్చేసినట్లుగా సిమ్‌కార్డులను కూడా మార్చేసేవాళ్లు ఉంటారు. అలా సిమ్‌లు తీసుకుని ఆ తర్వాత వాడకుండా పక్కన పడేయడమో.. లేకపోతే ఎవరికైనా ఇవ్వడమో చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. ఇంకా వారి ఐడీ కార్డులను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకునేవాళ్లు కూడా ఉంటారు. అందుకే కేంద్రం ఒక్కో వ్యక్తికి 9 సిమ్ కార్డుల పరిమితి తీసుకు వచ్చింది.  ఒక వేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వారి సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. 

Also Read : పెళ్లికెళ్తే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మస్ట్.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?

9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వారి వివరాలన్నింటినీ పరిశీలిస్తారు.  ఒకవేళ ఆ సిమ్‌ల్లో ఏ ఒక్కటి వెరిఫై చేయకపోయిన మిగిలిన నెంబర్లను కూడా డియాక్టివేట్ చేస్తారు. అయితే కొన్ని సున్నితమైన రాష్ట్రాల్లో ఈ నిబంధన మరింత కఠినంగా అమలు చేస్తారు. జమ్మూ కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని వినియోగదారులు ఆరు సిమ్‌ల కంటే ఎక్కువ కలిగి ఉంటే వాటిని పరిశీలించాలని తెలిపింది. 6 కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నట్లయితే కనెక్షన్ కట్ చేస్తారు. 

Also Read : దేశంలో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి..

ఉన్న సిమ్ కార్డుల్లో తమకు నచ్చింది యాక్టివ్‌లో ఉంచుకుని మిగిలిన వాటిని స్విచ్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టెలికాం ఆపరేటర్‌లను 9 కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లు కలిగి ఉన్న వినియోగదాను కేంద్రం కల్పించింది.  క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాల విచారణలో నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

Also Read : నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌

మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం సులువే.   https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది. మొబైల్‌ నంబర్‌ కింద ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ నంబర్‌ మీది కాకపోయినా.. ఆ నంబర్‌ ఇక మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget