అన్వేషించండి

One Nation One Election: 2029 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక - లా కమిషన్ ప్రతిపాదన

One Nation One Election: 2029 నాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించింది.

One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నికపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. వెంటనే అమల్లోకి తీసుకురావాలని భావించినా అది ఇప్పటికిప్పుడు కుదరకపోవచ్చని  Law Commission వెల్లడించింది. ఇప్పుడు మరోసారి కీలక ప్రకటన చేసింది లా కమిషన్. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశముంది. రిటైర్డ్ జస్టిస్ రితూ రాజ్ ఆవస్థి ఈ కమిషన్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది. 2029 లో మే-జూన్ మధ్య కాలంలో 19వ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. రాజ్యాంగంలో కొత్తగా "simultaneous election" అనే సెక్షన్‌ని చేర్చాలన్న ప్రతిపాదన కూడా చేసింది లా కమిషన్. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నేళ్ల పాటు కొనసాగించవచ్చన్న అంశం కూడా అందులో చేర్చాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను పాటిస్తూనే...కొత్తగా మార్పులు ఎలా చేయొచ్చో ఆలోచించాలని తెలిపింది. 

సాధారణంగా అసెంబ్లీ గడువు ఐదేళ్ల వరకూ ఉంటుంది. అయితే...మూడు లేదా ఆరు నెలల లోపు గడువు ముగిసే రాష్ట్రాలను ముందుగా పరిగణనలోకి తీసుకుని అక్కడ తొలి విడతలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించింది. ఈ లోగా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కారణంగా కుప్ప కూలినా...ఒకవేళ హంగ్‌ ఏర్పడినా ఆ సమయంలో unity government ని ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒకవేళ unity government ఆలోచన సక్సెస్ కాకపోతే...వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది లా కమిషన్. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా ఈ కమిటీ మేధోమథనం కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, ఢిల్లీలో వచ్చే ఏడాది, 2026లో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలకు వెళ్తాయి. 

ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పై లా కమిషన్ గతేడాది సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ (Law Commission) చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. లా కమిషన్ ఏం చెబుతుంది..అని ఉత్కంఠగా ఎదురు చూసినప్పటికీ ఏ ప్రకటనా రాలేదు. దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నారు జస్టిస్ రీతూరాజ్. అందుకే రిపోర్ట్‌ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని వెల్లడించారు. 

Also Read: Himachal Political Crisis: నేను రాజీనామా చేయలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Rithu Chowdhary Marriage : రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
Embed widget