News
News
X

North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దూకుడు పెంచారు. తాజాగా స్వల్ప శ్రేణి క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించారు.

FOLLOW US: 
 
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దుందుడుకు చర్యలకు దిగారు. దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలను పెంచారు. తాజాగా ఉత్తర కొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.

సీరియస్

ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడిందని పేర్కొంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. అదే సమయంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. జపాన్‌ కోస్టు గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధ్రువీకరించారు.

News Reels

రెడీగా

ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని దక్షిణ కొరియా ఆరోపించింది.

" ఈ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టడం ముమ్మాటికీ కవ్వింపు చర్యగానే మేం భావిస్తున్నాం. ఎలాంటి చర్యలనైనా ప్రతిఘటించేందుకు మా సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. మరికొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా దక్షిణ కొరియాను సందర్శించనున్నారు.                                           "
-   దక్షిణ కొరియా

కొత్త చట్టం

ప్రపంచంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త బాంబు పేల్చారు. అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. త‌న‌ను తాను ర‌క్షించుకునే సమయంలో ముంద‌స్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అణ్వాయుధీక‌ర‌ణ అంశంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

" అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గేదే లేదు. మా దేశాన్ని రక్షించుకునే విషయంలో అవసరమైతే ముందుగా మేమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.                               "

-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత

దేశానికి న్యూక్లియ‌ర్ స్టేట‌స్ ఇస్తూ నార్త్ కొరియా పార్ల‌మెంట్ ఈ కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాల‌ను ఆటోమెటిక్‌గా వాడుకునే అవ‌కాశాన్ని మిలిట‌రీకి క‌ల్పిస్తున్న‌ట్లు కొత్త చ‌ట్టంలో పేర్కొన్నారు.

Also Read: UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!

Also Read: Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Published at : 25 Sep 2022 03:56 PM (IST) Tags: North Korea North Korea fires ballistic missile east coast of Korean peninsula

సంబంధిత కథనాలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

TSPSC JL Recruitment: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా!

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

వరంగల్ నగరంలో నూతన సీపీ అకస్మిక తనిఖీలు, పోలీసులకు కీలక సూచనలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

Vijayawada Pipe Leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీక్, చిన్నారులకు అస్వస్థత

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ