అన్వేషించండి

Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ

Noida Airport : నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

Noida International Airport: ఢిల్లీ-ఎన్‌సీఆర్  ప్రాంతానికి మకుటాయమానంగా, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలవనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.  ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో శనివారం ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా, దేశ విమానయాన రంగంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం.
 
 ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం 

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జేవార్ వద్ద సుమారు 5,000 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే భారత్‌లోనే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయంగా, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయంగా రికార్డు సృష్టించనుంది. మొత్తం నాలుగు దశల్లో జరగనున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక, ఏటా 7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం 

ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) పై ఉన్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికి నోయిడా ఎయిర్‌పోర్ట్ కీలకం కానుంది. ఢిల్లీ నుంచి సుమారు  72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్.. నోయిడా, ఘజియాబాద్, అలీఘర్, ఆగ్రా, మథుర , ఫరీదాబాద్ వంటి నగరాల ప్రజలకు ఎంతో చేరువ కానుంది. దీనివల్ల పశ్చిమ ఉత్తరప్రదేశ్ , హర్యానా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది.

 డిజిటల్ ,  నెట్ జీరో ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ 

ఈ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో డిజిటల్ ఎయిర్‌పోర్ట్ గా తీర్చిదిద్దుతున్నారు. కాంటాక్ట్‌లెస్ చెక్-ఇన్, ముఖ గుర్తింపు  వంటి అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. మరీ ముఖ్యంగా, ఇది భారతదేశపు మొట్టమొదటి  నెట్ జీరో ఎమిషన్ విమానాశ్రయం. అంటే, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, పునరుత్పాదక ఇంధనం, హరిత సాంకేతికతతో ఈ విమానాశ్రయం పనిచేస్తుంది.

 ఆర్థిక విప్లవం - వేలాది ఉద్యోగాలు 

నోయిడా ఎయిర్‌పోర్ట్ రాకతో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. విమానాశ్రయం సమీపంలోనే ఎంఎస్ఎంఈ  పార్కులు, టెక్స్‌టైల్ పార్కులు , మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లు ఏర్పాటు అవుతున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1 లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే ఆగ్రా, మథుర వంటి పర్యాటక ప్రాంతాలకు విదేశీ పర్యాటకుల రాక సులభతరం కానుంది.   

 మల్టీ మోడల్ కనెక్టివిటీ 

ఈ ఎయిర్‌పోర్ట్‌ను రోడ్డు, రైలు,  మెట్రో మార్గాలతో అనుసంధానిస్తున్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ,  ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గం ద్వారా ప్రయాణికులు అతి తక్కువ సమయంలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget