BJP Leader on Kejriwal: భారత రత్న తరవాత నోబెల్ ప్రైజ్ అడుగుతారేమో, కేజ్రీవాల్ కామెంట్స్‌పై బీజేపీ సెటైర్లు
BJP Leader on Kejriwal: మనీష్ సిసోడియా భారత రత్నకు అర్హుడు అన్న కేజ్రీవాల్ కామెంట్స్‌పై భాజపా ఫైర్ అవుతోంది.
BJP Leader on Kejriwal:
ఆప్..అరాచకాల పార్టీ: బీఎల్ సంతోష్
ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా..విద్యా రంగానికి చేసిన సేవలకు భారత రత్న పురస్కారానికి అర్హుడన్న సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. భాజపా నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ "ఇప్పుడు భారత రత్న అన్నారు. బహుశా తరవాత కేజ్రీవాల్ తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారేమో" అని సెటైర్లు వేశారు. ఆప్‌ను అరాచకాల పార్టీ అంటూ విమర్శించిన ఆయన..."సత్యేంద్ర జైన్‌కు పద్మ విభూషణ్, మనీష్ సిసోడియాకు భారత రత్న, తరవాత కేజ్రీవాల్‌కు నోబెల్ పురస్కారం" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్...కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. "మనీష్ సిసోడియా విద్యారంగంలో చేసిన సేవలు చాలా గొప్పవి. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేనివి ఆయన చేయగలిగాడు. ఆయన భారతరత్నకు కూడా అర్హుడు. కానీ..కేంద్రం కుట్ర పన్నుతూ సీబీఐ అస్త్రం వినియోగిస్తోంది" అని అన్నారు. "మనీష్ సిసోడియా అరెస్ట్ అవుతారు. బహుశా నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో ఎవరికి తెలుసు..? ఇదంతా కేవలం గుజరాత్ ఎన్నికల కోసమే" అని విమర్శించారు కేజ్రీవాల్. గుజరాత్ ప్రజలు భాజపాను 27 ఏళ్లుగా భరిస్తున్నారని, వాళ్ల అరాచక పాలనలో వాళ్లు మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ Padma Vibhushan ‘ for Satyendra Jain ... Bharath Ratna for Manish Sisodia .... Next Noble Prize for himself ..... Great going anarchist party @AamAadmiParty
— B L Santhosh (@blsanthosh) August 22, 2022
మెరుగైన వైద్యం, విద్య..
తమ పార్టీని గెలిపిస్తే...మెరుగైన విద్య,వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుజరాతీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామనీ
చెప్పారు. "ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో గుజరాత్‌లోనూ పట్టణాలు, గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ఉన్న ప్రభుత్వాసు పత్రులను బాగు చేయటమే కాకుండా.. కొత్త ఆసుపత్రులనూ అందుబాటులోకి తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని బస్ డ్రైవర్లు, కండక్టర్లు...ఆప్‌నకు ఓటు వేయాలని ప్రయాణికులకు చెప్పాల్సిందిగా కోరారు. ఢిల్లీ తరహాలోనే గుజరాత్‌లోనూ మెరుగైన పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
భాజపా నుంచి ఆఫర్: సిసోడియా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సృష్టించిన అలజడి కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దేశమంతా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం స్కామ్‌లో తెరాసలోని పెద్దలు కీలక పాత్ర పోషించారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అటు..సీబీఐ ఈ కేసులో 8 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అటు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా భాజపాపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో చేరాలని భాజపా తనను అడిగిందని, అలా చేస్తే...ఈడీ కేసులు, సీబీఐ సోదాలు అన్నింటినీ నిలిపివేస్తామని చెప్పిందని కామెంట్స్ చేశారు సిసోడియా. "నాకు భాజపా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆప్ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరండి. ఈడీ కేసులన్నీ క్లోజ్ చేస్తాం అని అందులో ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువేనని పదేపదే చెప్పిన సిసోడియా భాజపాకు ఏం రిప్లై ఇచ్చారో కూడా వివరించారు. "నేనో రాజ్‌పుత్‌ని. మహారాణ ప్రతాప్ వారసుడిని. నా తలైనా నరుక్కుంటాను కానీ...అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి. మీరేం చేసుకుంటారో చేసుకోండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పాదయాత్రలో బండి సంజయ్ అరెస్ట్- జనగామలో హైటెన్షన్
Also Read: Vitamin D: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి