Nara Lokesh Tweet: ముస్లిం మైనార్టీలను అంతమొందించేందుకు జగన్ సీఎం అయ్యారా: లోకేష్
Nara Lokesh on CM Jagan: ముస్లిం మైనార్టీలను అంతమొందించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.
Nara Lokesh on CM Jagan: ముస్లిం మైనార్టీలను అంతంమొందించేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. నరసారావుపేట మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టీడీరీ నేత షేక్ ఇబ్రహీంను పట్టణవాసులంతా చూస్తుండగా అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకు పరాకాష్ట అని తెలిపారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త అలీ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అది ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లేనంటూ ట్వీట్ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారంటూ ఫైర్ అయ్యారు. "జగన్ గారు.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా?" అంటూ ప్రశ్నించారు.
ముస్లిం మైనారిటీలని అంతమొందించేందుకే @ysjagan గారు ముఖ్యమంత్రి అయినట్టుంది. మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టిడిపి నేత షేక్ ఇబ్రహీం గారిని నరసరావుపేట పట్టణంలో అంతా చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేయడం జగన్ సైతాన్ పాలనకి పరాకాష్ట.(1/3)#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/f8lW3jfDx0
— Lokesh Nara (@naralokesh) December 21, 2022
వైసీపీ మూకల దాడిలో గాయపడిన మరో కార్యకర్త ఆలీ గారి పరిస్థితి విషమంగా ఉంది. ఇవి ముమ్మాటికీ వైసీపీ సర్కారు స్పాన్సర్డ్ మర్డర్లే. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఉసురు తీశారు. ఇప్పుడు ఇబ్రహీం సాబ్ ని చంపేశారు. జగన్ రెడ్డి గారూ.. మీ ధనదాహం, రక్తదాహం తీరదా?(2/3)
— Lokesh Nara (@naralokesh) December 21, 2022
ఇబ్రహీంని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని,అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. మృతుడి కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీకి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందన్నారు.
ఇబ్రహీం ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని, అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్రహీం కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వైసిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా పోరాటం మరింత ఉధృతమవుతుంది.(3/3)
— Lokesh Nara (@naralokesh) December 21, 2022