అన్వేషించండి

Nara Lokesh: బీహార్‌లో ఎన్టీఏ తరపున నారా లోకేష్ ప్రచారం - చంద్రబాబు, పవన్ కాకుండా లోకేషే ఎందుకు?

Bihar campaign: బీహార్‌లో ఎన్డీఏ తరపున ప్రచారం చేయడానికి నారా లోకేష్ వెళ్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కాకుండా లోకేష్‌ను ప్రచారానికి పిలవడం చర్చనీయాంశంగా మారింది.

Nara Lokesh is going to campaign on behalf of NDA in Bihar :   ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ (NDA) అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారు. బీహార్‌లో 243  నియోజకవర్గాలకు రెండు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటి దశ   నవంబర్ 6న పూర్తి అయ్యింది. రెండో దశలో 122 నియోజకవర్గాలకు పోలింగ్  నవంబర్ 11న జరగనుంది. తొమ్మిదో తేదీ అంటే ఆదివారం సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. ఈ సమయంలో నారా లోకేష్ చివరి రెండు రోజులు బీహార్ లో ప్రచారంచేయాలని నిర్ణయించారు. శనివారం  సాయంత్రం  రెండు సమావేశాల్లో పాల్గొంటారు. ఆదివారం  పట్నాలో NDA అభ్యర్థులకు మద్దతుగా బహిరంగసభలో ప్రసంగిస్తారు.            

యువతకు ఉద్యోగ, ఉపాధి అంశాలపై భరోసా ఇచ్చేందుకు ప్రచారం      

ఎన్డీఏ పార్టీలు యువతకు ఉద్యోగాల కల్పన, ఉపాధి విషయంలో ఎక్కువ భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. యువకులు తాము వలస పోకుండా బీహార్ లోనే ఉండేలా ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకు వచ్చేందుకు నారా లోకేష్ చేస్తున్న కృషి, గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆయనకు వచ్చిన ప్రచారం బీహార్ యూత్ లో నమ్మకం కలిగించిందని అంటున్నారు. అందుకే నారా లోకేష్ తో..  ఎన్డీఏ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఘనంగా సృష్టిస్తుందని చెప్పించాలని భావించినట్లుగా తెలుస్తోంది.       

చంద్రబాబు, పవన్ కాకుండా నారా లోకేష్‌తోనే ప్రచారం ఎందుకు ? 

నిజానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఉత్తరాదిన మంచి గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండటమే కాకుండా.. అభివృద్ధి రాజకీయాలకు పెద్దపీట వేస్తారని హిందీ ప్రజల్లో చంద్రబాబుకు పేరుంది. అందుకే గతంలో పలు చోట్ల ఇతర పార్టీల కోసం ప్రచారం చేశారు కూడా. అదే సమయంలో పవన్ కల్యాణ్‌కూ బీహార్ ప్రజల్లో గుర్తింపు ఉంది. సినీ హీరోగా ఆయన సినిమాలో భోజుపురిలోకి డబ్బింగ్ అయ్యాయి.హిందీలోకీ డబ్బింగ్ అయ్యాయి. ఆయన వచ్చినా జన సమీకరణ బాగానే జరుగుతుంది. అయితే ఎన్డీఏ పెద్దలు జన సమీకరణ కన్నా.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా లోకేష్ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.  

ఎన్డీఏ పథకాలను వివరించనున్న లోకేష్                              

బీహార్‌లో యువతకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి పె NDA ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రచారం చేసే అవకాశం ఉంది.  కేంద్ర-రాష్ట్ర డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధికి ఎలా దోహదపడతాయో వివరిస్తారు. ప్రధాని మోదీ నాయకత్వంలో NDA బలపడితే బీహార్‌కు మరిన్ని ప్రయోజనాలు వస్తాయని హైలైట్ చేస్తారు.  NDA ప్రతిపాదించిన స్కిల్స్ సెన్సస్  ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, బీహార్ యువతకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేసే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ, థింసా నృత్యంతో కనువిందు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ, థింసా నృత్యంతో కనువిందు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
PM Modi Inaugurates Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Embed widget