అన్వేషించండి

TDP 48 MLAs: టీడీపీలో సంచలనం- 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్- నోటీసులు జారీ

Chandrababu Naidu: టీడీపీ 48 ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదనిచంద్రబాబు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా వీరు పంపిణీ చేయడం లేదు.

Chandrababu Naidu orders notices to be issued to 48 TDP MLAs : టీడీపీ ఎమ్మెల్యేల్లో 48 మంది పూర్తిగా దారి తప్పారని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పిన వికపోవడంతో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు.  ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ప్రవర్తనలో లోపాలు ఉన్న 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన సీఎం, పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత వంటి కార్యక్రమాలపై సమీక్షించారు.   

పేదలకు సాయంగా ఇచ్చే చెక్కులూ పంపిణీ చేయని ఎమ్మెల్యేలు                  

ప్రజల సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యేలు ఎంత మంది అందుబాటులో ఉంటున్నారో తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాల పరిమితి తీరిపోయే వరకూ పంపిణీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసే కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం సీఎం దృష్టికి వచ్చింది.  బ్యాక్ ఆఫీసు, ప్రోగ్రాం కమిటీకి ఆదేశాలు జారీ చేస్తూ, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని సూచించారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెన్షన్ల పంపిణీకీ దూరం                                                                
 
పేదల సేవలో భాగంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సురెన్స్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి.  పనిచేసిన వారందర్నీ కలుపుకుని వెళ్లాలన్నారు.  ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. పాల్గొనకపోతే పార్టీ కేంద్ర కార్యాలయం  వివరణ తీసుకోవాలి ఆదేశించారు.  కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు.   

పనితీరు మారకపోతే పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయం

పేదలకు ఎన్నోకష్టాల్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటారు. వారికి  మంజూరు అయిన డబ్బులు కూడా ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు తీరిక లేకపోతే ఇక వారికి ప్రజా సేవ చేయడానికి అర్హత ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం ఆర్ఎఫ్ చెక్కులకు మూడు నెలల పరిమితి ఉంటుంది. ఇష్యూ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు చెక్కులు పంపిణీ  చేయకపోవడం వల్ల అవి తిరిగి వస్తున్నాయి . కొత్తగా చెక్కులు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది సీఎంను అసహనానికి గురి చేసింది.  ఇప్పటి వరకూ చూశామని ఇక పనితీరు మార్చుకోకపోతే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.               

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget