అన్వేషించండి

CM KCR: ఇది ఆరంభం మాత్రమే, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు అవసరం : సీఎం కేసీఆర్

బీజేపీ తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో హైదరాబాద్ ప్రాంతీయ పార్టీలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackery)తో సీఎం కేసీఆర్(KCR) ఇవాళ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరువులు ముఖ్యమంత్రులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశ రాజకీయాలు, అభివృద్ధి గురించి ఉద్ధవ్ ఠాక్రేతో సుదీర్ఘంగా చర్చించామని, అనేక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఉద్ధవ్ ఠాక్రేను కలవడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారని, వారిని త్వరలో కలుస్తానన్నారు. మరికొద్ది రోజుల్లో అందరి నేతలతో హైదరాబాద్‌(Hyderabad)లో సమావేశమవుతున్నారు. 1000 కి.మీల సరిహద్దు మహారాష్ట్ర(Maharastra), తెలంగాణ(Telangana)లదేని అనిపిస్తోంది. మహారాష్ట్ర సహకారంతో పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు.  

 

దేశంలోని రాజకీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో రావాల్సిన మార్పుల‌పై చర్చించామని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక అవ‌స‌రమని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర సీఎంతో చ‌ర్చలు ఆరంభం మాత్రమే మున్ముందు పురోగ‌తి వ‌స్తుంద‌న్నారు. త్వర‌లో అన్ని ప్రాంతీయ పార్టీల‌తో స‌మావేశ‌మై భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సంస్థల‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ తన వైఖరి మార్చుకోకుంటే ఇబ్బందులు త‌ప్పవని హెచ్చరించారు. శివాజీ(Shivaji), బాల్ ఠాక్రే(Bal Thackery) వంటి యోధుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక‌ మార్పు రావాలన్నారు. రాబోయే రోజుల్లో శివసేనతో క‌లిసి పని చేస్తామన్నారు. 

'దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పెనుమార్పులు అవసరం. మహారాష్ట్ర నుంచి ఏ ఫ్రంట్ వచ్చినా అది విజయమే. అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రేను తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానిస్తున్నాను.' అని సీఎం కేసీఆర్ అన్నారు. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ..  దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, ప్రతీకార భావంతో చర్యలు తీసుకుంటున్న తీరును సమర్ధించడం లేదన్నారు. ఈ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రకం సమీకరణం ప్రారంభమైందని, దీన్ని పూర్తిగా రూపొందించడానికి కచ్చితంగా సమయం పడుతుందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
AP Local Body Elections: పట్టణ స్థానిక పోరులో కూటమి హవా- జగన్, పెద్దిరెడ్డి కంచుకోటల్లో 6 సహా 12 చైర్మన్లు ఏకగ్రీవం!
పట్టణ స్థానిక పోరులో కూటమి హవా- జగన్, పెద్దిరెడ్డి కంచుకోటల్లో 6 సహా 12 చైర్మన్లు ఏకగ్రీవం!
ABP Desam Top 10, 20 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 20 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Akshayakalpa Shashi Kumar: విప్రోలో రూ.లక్షల జీతం వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు.. ఇప్పుడు నెలకు రూ.60 కోట్ల ఆదాయం.. 'అక్షయకల్ప' శశికుమార్ సక్సెస్ స్టోరీ!
విప్రోలో రూ.లక్షల జీతం వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు.. ఇప్పుడు నెలకు రూ.60 కోట్ల ఆదాయం.. 'అక్షయకల్ప' శశికుమార్ సక్సెస్ స్టోరీ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
TG High Court Verdict: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Aadarsha Kutumbam Maala Song : నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
Embed widget