Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి..
అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణు గోపాల్ రెడ్డిగా గుర్తించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ దాటాక యూ టర్న్ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్ పల్లికి చెందిన ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణు గోపాల్ రెడ్డిగా గుర్తించారు.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కవిత దంపతులు రాత్రి 8 గంటల సమయంలో నల్లగొండ నుండి హైదరాబాద్ బయల్దేరారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వీరి కారు టిప్పర్ ను బలంగా ఢీకొంది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
వారం కిందటే కూతురు వివాహం..
ఎంపీటీసీ కవిత దంపతులు వారం రోజుల కిందటే నల్లగొండలో తమ కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వీరు నివాసం ఉండే నల్లగొండలోని స్వర్ణ ప్యాలెస్ తో పాటు స్వగ్రామం అనిశెట్టి దుప్పలపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కవిత దంపతుల మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బోటి కూర కోసం మందుబాబు రచ్చ..
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు రచ్చ రచ్చ చేశాడు. బోటి కూర కావాలని వైన్ షాప్ నిర్వాహకుడిని అడిగాడు. అతడు కూర తెచ్చి ఇవ్వగా... వేడిగా లేదు, వేడి చేసి మళ్లీ తీసుకురమ్మని చెప్పాడు. మద్యం మత్తులో గట్టిగా అరుస్తూ కేకలు పెట్టాడు. కూర తీసుకురానుందుకు వేడి వేడి నూనెను నిర్వాహకుడిపై పోశాడు. ఈ ఘటన నాచారం ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్‌లోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీకి చెందిన ధర్మేందర్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు.
Read More: Hyderabad News: బోటి కూర కోసం మందుబాబు రచ్చరచ్చ.. వేడి వేడిగా ఇవ్వలేదంటూ కాగుతున్న నూనె పోసి దాడి..
Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి.. ముగ్గురు అక్కడికక్కడే మృతి