Rajasthan MLAL: అసెంబ్లీలో ప్రశ్నలు అడగకపోతే రెండున్నర కోట్లు - లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎమ్మెల్యే
MLA Arrest: అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఓ మైనింగ్ యజమాని వద్ద లంచం తీసుకున్నాడు ఎమ్మెల్యే్. ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

MLA took bribe from mining owner: రాజస్తాన్ కు చెందిన ఎమ్మెల్యే ఒకరు మైనింగ్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయారు.ఈ వ్యవహారం రాజస్థాన్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జైకృష్ణ్ పటేల్ అనే ఎమ్మెల్యే తన క్వార్టర్స్ లో ఓ మైనింగ్ యజమాని నుంచి ఇరవై లక్షలు క్యాష్ తీసుకుంటూండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అ క్యాష్ ను.. ఎమ్మెల్యే గన్ మెన్ గా ఉన్న వ్యక్తి తీసుకున్నారు. జై కృష్ణ పటేల్ భారత్ ఆదివాసీ పార్టీ (BAP)కి చెందిన ఎమ్మెల్యే.
ఇటీవల రాజస్థాన్ శాసనసభలో అక్రమ మైనింగ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు వెనక్కి తీసుకోవడానికి , మళ్లీ ఆడగకుండా ఉండటానికి జైకృష్ణ్ పటేల్, ఒక మైన్ యజమాని నుండి మొత్తం 2.5 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకున్నాడు. మొదటి విడతగా 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ లంచం లావాదేవీ జైపూర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగింది. ఎమ్మెల్యే గన్‌మ్యాన్ ఈ లావాదేవీలో మధ్యవర్తిగా వ్యవహరించి, 20 లక్షల రూపాయలను స్వీకరించారు. రాజస్థాన్ యాంటీ-కరప్షన్ బ్యూరో ఈ కేసులో జైకృష్ణ్ పటేల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ACB డైరెక్టర్ జనరల్ రవి ప్రకాష్ మెహర్దా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
यह राजस्थान के बागीदौरा क्षेत्र से भारत आदिवासी पार्टी के विधायक जयकृष्ण पटेल हैं. आदिवासियों के मुद्दे उठाने का दम भरते थे लेकिन माइनिंग कारोबारी से 20 लाख रूपये रिश्वत लेते रंगे हाथों धरे गए हैं. #jaikrishnapatel #rajasthan
— Ravish Pal Singh (@ReporterRavish) May 5, 2025
नोट: जनाब पहली बार विधायक बने थे pic.twitter.com/Q2NC2EcJvd
జై కృష్ణ పటేల్ లంచం అడుగుతున్నాడని మైనింగ్ యజమాని ACBకి ఫిర్యాదు చేశారు, ఎ ఈ ఫిర్యాదు ఆధారంగా, ACB ఒక ట్రాప్ సెట్ చేసింది. ACB బృందం, రవి ప్రకాష్ మెహర్దా నేతృత్వంలో, ఎమ్మెల్యేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ నిర్వహించింది. గన్‌మ్యాన్ ద్వారా 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.ACB బృందం లంచం డబ్బు, సంబంధిత డాక్యుమెంట్లు, మరియు ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
బాగీదౌరా నియోజకవర్గం నుండి ఎన్నికైన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే. BAP అనేది రాజస్థాన్‌లో ఆదివాసీ ప్రాంతాలలో బలమైన ప్రభావం కలిగిన ప్రాంతీయ పార్టీ. ఈ ఘటన రాజస్థాన్‌లో రాజకీయ అవినీతిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలకు ఒక సానుకూల సంకేతంగా కొంత మంది భావిస్తున్నారు, అయితే కొందరు దీనిని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు.
VIDEO | Jaipur: ACB DG Ravi Prakash Meharda briefs press on Bharat Adivasi Party MLA Jai Krishna Patel’s detention: “MLA Jai Krishna Patel has been trapped by the ACB team while accepting a bribe of Rs 20 lakh today. This operation had been underway for some time. The… pic.twitter.com/lC16VdqgBF
— Press Trust of India (@PTI_News) May 4, 2025
రాజస్థాన్ చరిత్రలో ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం ఇదే మొదటి సారి. - ఈ ఘటన రాజస్థాన్ శాసనసభలో మైనింగ్ సమస్యలు , రాజకీయ అవినీతిపై మరింత చర్చను జరగేలా చేయనుంది.





















