India Pak Tensions: కాపాడాలని ఐక్యరాజ్యసమితి వద్దకు పరుగెత్తిన పాకిస్తాన్ - నెక్ట్స్ ఏమిటంటే ?
UNSC Emergency Meet: భారత్ దాడులు చేయడానికి సిద్ధమవుతూండటంతో పాకిస్తాన్ వణికిపోతోంది. కాపాడాలని ఐక్యరాజ్య సమితికి మొరపెట్టుకుంది.

UNSC Emergency Meet On India Pak Tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ అత్యవసర అభ్యర్థన తర్వాత UN భద్రతా మండలి సోమవారం రహస్య సంప్రదింపులు జరపనుంది. ఈ సమావేశం ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడుతుందని ప్రస్తుతం UNSCకి అధ్యక్షత వహిస్తున్న గ్రీస్ భావిస్తున్నారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూనే, పెరుగుతున్న ప్రాంతీయ ఆందోళనలను, భారతదేశం ఆగ్రహాన్ని ఐక్యరాజ్య సమితి పరిగణనలోకి తీసుకోవాల్సింది.
🚨 UN Security Council to hold closed-door talks today on India-Pak tensions post-Pahalgam attack.
— Beats in Brief (@beatsinbrief) May 5, 2025
India to stress cross-border terror; Pakistan to raise Indus Waters Treaty. pic.twitter.com/wEtMoDV14z
రహస్యంగా జరిగే క్లోజ్డ్ డోర్ మీటింగ్
యూఎన్ భద్రతా మండ క్లోజ్డ్-డోర్ మీటింగ్‌లు రహస్యంగా జరిగే సమావేశాలు. ఇవి సాధారణంగా బహిరంగంగా చర్చించరు. వివరాలు కూడా వెల్లడిచరు. మీడియా లేదా ఇతర యూఎన్ సభ్య దేశాలు ఈ సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. కేవలం భద్రతా మండలి సభ్య దేశాల ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశాలలో పాల్గొంటారు. సున్నితమైన రాజకీయ, భద్రతా సమస్యలు, సంఘర్షణలు, సంక్షోభాల గురించి చర్చలు జరుగుతాయి.
భారత్ దాడి చేస్తుందన్న భయంతో ఉన్న పాకిస్తాన్
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పొందినట్లు ప్రకటించింది. తర్వాత దీనిని ఖండించింది. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ సరిహద్దు వాణిజ్యాన్ని నిలిపివేయడం, మరియు దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ ఈ ఉద్రిక్తతలను చర్చించడానికి ఒక అత్యవసర క్లోజ్డ్-డోర్ సమావేశాన్ని కోరింది భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గామ్ దాడి , దాని తర్వాత భారత్ తీసుకున్న చర్యలు, వీటిలో ఇండస్ వాటర్స్ ఒప్పందం రద్దు మరియు సరిహద్దు వాణిజ్య నిలిపివేత వంటివి చర్చకు వచ్చే అవకాశంఉంది.
ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రమేయంపై ఆధారాలు ఇస్తున్న భారత్
భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ శాశ్వతసభ్య దేశాలు. పాకిస్థాన్ యూఎన్ రిప్రజెంటేటివ్ అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ పహల్గామ్ దాడిలో తమ ప్రమేయం లేదని ఖండిస్తూ, "తటస్థ దర్యాప్తు" కోసం పిలుపునిచ్చారు.
భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా , పాకిస్థాన్ మినహా మిగిలిన భద్రతా మండలి సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపారు. భారత్ పాకిస్థాన్ యూఎన్ వేదికను "ప్రచారం" కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. భారత్ రష్యా, ఫ్రాన్స్, యూఎస్, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల నుండి మద్దతు కోరింది. ఎలాగోలా భారత్ తీసుకునే చర్యల నుంచి బయటపడాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.





















