Amalapuram: మంత్రికి, ఎంపీకి చేదు అనుభవం.. అందరి ముందు ముఖంపైనే ఆ మాట అనడంతో వేదికపైనే..

బలహీన వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించకపోతే దళిత ఓటు బ్యాంకుతో నెగ్గిన ప్రజాప్రతినిధులు అవసరమైతే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ నాయకుడు రేవు తిరుపతిరావు.. మంత్రి, ఎంపీ ముఖంమీదే అన్నారు.

FOLLOW US: 

మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధలకు విద్యార్థి నాయకుల నుంచి చేదు అనుభవం అనుభవం ఎదురైంది. వారు రాజీనామా చేయాలని విద్యార్థి నాయకుడు ముఖం మీదే డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించకపోతే దళిత ఓటు బ్యాంకుతో నెగ్గిన ప్రజాప్రతినిధులు అవసరమైతే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ నాయకుడు రేవు తిరుపతిరావు.. మంత్రి, ఎంపీ ముఖంమీదే చెప్పారు. దీంతో రాష్ట్ర మంత్రి వినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేయనున్న కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న నినాదంతో అమలాపురంలో నిర్వహించిన విజ్ఞావనా దీక్షలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

స్థానిక గడియారస్తంభం వద్ద ఆదివారం కోనసీమ వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా 12 గంటల విజ్ఞావన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థి సంఘ నాయకుడు తిరుపతిరావు అవసరమైతే రాజీనామా చేయాలన్న మాటతో ఈ పరిణామానికి వేదికపైనున్న మంత్రి, ఎంపీ తోపాటు పలువురు నాయకులు షాక్ అయ్యినంత పని అయ్యింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను ముఖంపైనే ఇలా అనకూడదంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఒక దశలో మంత్రి విశ్వరూప్ అనుచర వర్గం దీనిపై వ్యతిరేకిస్తూ మాట్లాడడంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే తిరుపతిరావు మాట్లాడిన విషయంపై కూడా కొందరు ఏమాత్రం వెనకు తగ్గలేదు. దీంతో మంత్రి విశ్వరూప్ మైక్ తీసుకుని న్యాయమైన కోర్కెలను న్యాయబద్ధంగా ఏ విధంగా చేయాలో ఆలోచన చేయాలే తప్ప ఈ విధంగా మాట్లాడవద్దని, ఏ ఒక్క వర్గం, ఏ సామాజిక వర్గం కానీ కులం పేరుతో ఏదీ సాధ్యం కాదని డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ అన్నారని మంత్రి అన్నారు. ఈ విధంగా మీరు ఆర్గనైజింగ్ చేస్తున్నప్పుడు తానేమీ సాధించలేనని, ఏదైనా ఒక సిస్టమేటిక్ గా చేయాలని హితవు పలికారు. ఇక్కడి వచ్చిన నూటికి 90 మంది తన అభిమానులున్నారని, ఒక మంత్రిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం తీసుకువెళ్తానని అన్నారు. అంతేకానీ ఈ విధంగా మాట్లాడితే ఏమీ అయిపోదని మంత్రి అనగానే.. పక్కనుంచి ఏం ఫరవాలేదు.. ఏమైపోదులేండి అంటూ సైటైర్లు వేశారు మరికొందరు దళిత నాయకులు. 

దీంతో అంతా ఐక్యంగా పోరాడి న్యాయమైన కోర్కెను సాధించుకునేందుకు ప్రయత్నిద్దామని మంత్రి విశ్వరూప్ తన ప్రసంగాన్ని ముగించారు. ఎంపీ అనురాధ మాట్లాడుతూ అంబేడ్కర్ కేవలం మనకే చెందిన మనిషి కాదని, ఆయన ఒక మహానుభావుడని అన్నారు. మనందరం ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం కాదని.. ఎంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, కాబట్టి శాంతియుతంగా మనకు కావాల్సింది సాధించుకోవాలని అన్నారు. ఈ క్రమంలో మేమందరం మీతో ఉన్నామని చెబుతున్నామని అన్నారు. ఈ గందరగోళానికి అంతకు ముందు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, టీడీపీ నాయకుడు, రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఇతర సామాజిక వర్గాల నాయకులు తదితరులు హాజరై విజ్ఞావన దీక్షకు మద్దతు తెలిపారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ తో నిర్వహించిన విజ్ఞాపనా దీక్షకు కోనసీమ వ్యాప్తంగా పార్టీలకతీతంగా దళిత సంఘాల నాయకులు, ఆయా పార్టీల నాయకులు హాజరుకాగా ఎక్కువ మంది మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమంటూ అసహనం వ్యక్తం చేశారు.

Published at : 31 Jan 2022 08:09 AM (IST) Tags: Amalapuram New districts in AP Minister Vishwaroop MP Chinta Anuradha Konaseema new district PDSU leaders in ap

సంబంధిత కథనాలు

Chandigarh news:ఆ ఐఏఎస్ కొడుకుని అధికారులు టార్చర్ చేసి చంపారా, కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

Chandigarh news:ఆ ఐఏఎస్ కొడుకుని అధికారులు టార్చర్ చేసి చంపారా, కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలు

East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

East Godavari News : విహారయాత్రలో విషాదం, గోదావరిలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపు భారీగా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపు భారీగా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

టాప్ స్టోరీస్

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం