News
News
X

Zuckerberg's Security: జుకర్‌బర్గ్‌కు భారీగా సెక్యూరిటీ పెంచిన మెటా, లేఆఫ్‌ల ఎఫెక్టా?

Zuckerberg's Security: మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీని భారీగా పెంచింది మెటా.

FOLLOW US: 
Share:

 Zuckerberg's Security:

లేఆఫ్‌ల కారణంగా..? 

మెటా సీఈవో, కో ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కంపెనీ. ప్రస్తుతం ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి ఈ అలెవన్స్‌ 4 మిలియన్ డాలర్లుగా ఉండగా...ఇప్పుడు ఒకేసారి 14 మిలియన్ డాలర్లకు పెంచింది. "ప్రస్తుతం జుకర్‌బర్గ్ వ్యక్తిగత భద్రత కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని పెంచుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరం అనిపిస్తోంది"అని తేల్చి చెప్పింది మెటా కంపెనీ. ఉన్నట్టుండి ఇంత భారీ స్థాయిలో ఆయనకు భద్రత ఎందుకు పెంచాల్సి వచ్చిందన్నదే ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే...ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది మెటా. "తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తోంది" అని జుకర్‌బర్గ్ ప్రకటించారు కూడా. కారణమేదైనా ఒకేసారి ఇంత మందిని తీసేయడం ఏంటి అంటూ జుకర్‌పై మండి పడుతున్నారు ఉద్యోగులు. విమర్శలు కూడా కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో జుకర్‌పై ఎవరైనా దాడి చేస్తారేమో అని ముందుగానే జాగ్రత్త పడింది మెటా యాజమాన్యం. ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత పెంచాలని నిర్ణయించుకుంది. 

మెటాలో భారీగా లేఆఫ్‌లు..

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్‌ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. అప్పుడే మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు రావడం వల్ల దాదాపు ఖరారైనట్టే చెబుతున్నాయి కొన్ని రిపోర్ట్‌లు. అటు యాహూ కూడా లేఆఫ్‌లు మొదలు పెట్టింది. ఇప్పటికే 1600 మందిని తొలగించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది 20%. అంతకు ముందు ఎంటర్‌టైన్‌మెంట్ కంపనీ డిస్నీ కూడా 7 వేల మందిని తొలగించింది. కంపెనీ నష్టాల్లో ఉందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ వెల్లడించారు. 2022 డిసెంబర్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఐగర్‌కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యమూ ఈ లేఆఫ్‌లకు కారణమవుతోంది. 

Also Read: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు,పెంచక తప్పట్లేదంటున్న ప్రభుత్వం - ఇంతకీ ఎక్కడ?

Published at : 16 Feb 2023 12:14 PM (IST) Tags: security Meta layoffs Facebook  Zuckerberg's Security  Zuckerberg

సంబంధిత కథనాలు

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత