Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌కు రూ.15వేల కోట్ల నష్టం - ఆ ఆస్తులన్నీ కేంద్రానివే- అసలేం జరిగిందంటే?
Enemy Property: సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వారసత్వంగా రావాల్సిన ఆస్తులు.. ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించారు. దాంతో అవన్నీ కేంద్రానికి దక్కనున్నాయి.

Saif Ali Khan Rs 15 000 crore ancestral Bhopal property case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ , అతని కుటుంబానికి భోపాల్‌లో ఉన్న సుమారు రూ. 15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాటిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించింది. దాంతో సైఫ్ అలీఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వివాదంలో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కుటుంబానికి సంపత్తిపై హక్కులను కోల్పోయేలా చేసింది . సైఫ్ అలీ ఖాన్ భోపాల్ నవాబ్‌ల వంశానికి వారసుడు. ఈ వంశస్తుల ఆస్తులు భోపాల్‌లో చాలా ఉన్నాయి. ఆ ఆస్తుల యజమానులు, వారసత్వ హక్కుల చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. న్యాయపోరాటం జరుగుతోంది.
ఈ కేసు చాలా. కాలంగా కొనసాగుతోంది. సుదీర్ఘంగా సాగిన విచారణ తర్వాతస సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అతని సోదరీమణులు సోహా, సాబా, , తల్లి షర్మిలా ఠాగూర్ లను పూర్వీకుల ఆస్తులకు వారసులుగా పరిగణించిన 2000 ట్రయల్ కోర్టు ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసింది. ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని , ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీఆస్తి చట్టం కేంద్ర ప్రభుత్వానికి 1947లో విభజన తర్వాత పాకిస్తాన్ కు వలస వచ్చిన వెళ్లిన వారి ఆస్తులను క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తుంది.
1947లో భోపాల్ సంస్థానం చివరి నవాబ్ నవాబ్ హమీదుల్లా ఖాన్. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి తాత. నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వారిలో పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్లారు. అతని రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారతదేశంలోనే ఉండి, సైఫ్ అలీ ఖాన్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలుగా మారారు. భోపాల్ సంస్థానం ఏప్రిల్ 30, 1949న ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది. లిఖిత ఒప్పందం ప్రకారం, విలీనం తర్వాత నవాబ్ వ్యక్తిగత ఆస్తిపై పూర్తి యాజమాన్యం వారికి ఉటుంది. హమీదుల్లా ఖాన్ మరణం తర్వాత, సాజిదా సుల్తాన్‌ను నవాబ్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (22) ప్రకారం పూర్వీకుల ఆస్తిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం జనవరి 10, 1962న ఒక లేఖ జారీ చేసింది.
నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణం తరువాత, ముస్లిం పర్సనల్ లా ప్రకారం అతని వ్యక్తిగత ఆస్తిని విభజించాలి. ఆస్తి వారసత్వాన్ని కోరుతూ భోపాల్ జిల్లా కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేశారు కానీ.. అలహాబాద్ హైకోర్టు నిర్ణయం ఆధారంగా జిల్లా కోర్టు వారి దరఖాస్తును తిరస్కరించింది. 2015లో, ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబ్ భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది, ఆ తర్వాత పటౌడీ కుటుంబం న్యాయపోరాటం ప్రారంభించింది. 2019లో, సాజిదా సుల్తాన్‌ను చట్టబద్ధమైన వారసురాలిగా కోర్టు గుర్తించారు. ఆమె మనవడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తులలో వాటాను వారసత్వంగా పొందాడు. అయితే, అబిదా సుల్తాన్ పాకిస్తాన్‌కు వలస వెళ్లడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఆస్తులను 'శత్రువు ఆస్తి'గా ప్రకటించింది.





















