Viral Video : కూతురి ఫోన్ వ్యసనం తగ్గించడానికి తల్లి మాస్టర్ ప్లాన్! నవ్వాపుకోలేరు, షాక్ అవ్వాల్సిందే!
Viral Video : కూతురి నోటికి ఫోన్‌తో కలిపి ప్లాస్టర్ వేసిందో తల్లి. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. ఇలానే బుద్ధి చెప్పాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video : సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. క్షణం కూడా చేతిలో ఫోన్ లేకుండా ఉండలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే అవసరం ఉన్నంత వరకు ఫోన్ వాడటం ఓకే కానీ అదే పనిగా వాడుతున్న వాళ్లను నిత్యం చూస్తున్నాం. అలాంటి ఓ కుమార్తెకు తల్లి గట్టిగుణపాఠమే నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఇలా ఏ పనిచేసినా ఫోన్‌లో మునిగిపోయే వాళ్లను నిత్యం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఆ వ్యసనంలో పడిపోతున్నారు చాలా మంది. ఈ అలవాటు కారణంగా ఆరోగ్య విషయాలనే పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఉన్న వారి సంగతి కూడా మర్చిపోతున్నారు. ఇలా ఫోన్‌లోనే టైమంతా గడిపేస్తున్నారు.
ఇలా 24 గంటలు సెల్‌ఫోన్‌లో మునిగి తేలుతున్న వారి ప్రవర్తన కుటుంబ సభ్యులకు సమస్యగా మారుతుంది. ఇలాంటి స్థితిని చూసిన కొందరు కోపంగా స్పందిస్తారు. మరికొందరు తమదైన శైలిలో పరిష్కారం కనుగొంటారు. ఓ తల్లి చేసిన పని మాత్రం ఫన్నీగా ఉంది కానీ ఆశ్చర్యం కలిగించింది.
ఒక తల్లి తన కూతురిని ఫోన్ నుంచి దూరం చేయడానికి ఒక మార్గం కనుగొంది. అది చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నోటికి ఫోన్‌కు కలిపి ప్లాస్ట్ వేసిన తల్లి
చాలా మంది ప్రజలు ఫోన్‌కు బానిసలయ్యారు. వారు ఏ పని చేస్తున్నా ఫోన్ చేతుల్లో ఉండాల్సిందే. లేకుంటే వాళ్లు ఏ పని కూడా చేయలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి తింటూ కూడా ఫోన్‌లో రీల్స్ చూస్తూ మైమరిచిపోయింది. అప్పుడు ఆమె తల్లి వెనుక నుంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా, అకస్మాత్తుగా ఒక టేప్ తీస్తుంది. ఫోన్, మొహానికి కలిపి ప్లాస్టర్ వేస్తుంది. తన కూతురి రెండు చేతులను కూడా టేప్‌తో కట్టిపడేసింది.
కనీసం ఇంట్లో ఉన్న వారి గురించి కనీసం పట్టించుకోకుండా రీల్స్‌లో మునిగిపోతున్న ఆమె ఏం జరిగిందో తెలుసుకునే లోపు అంతా జరిగిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Mom of the year 😂😂 pic.twitter.com/SGOXpFT8Es
— Awesome Videos ❤️ (@Awesomevideos07) July 1, 2025
ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
వైరల్ అవుతున్న ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @Awesomevideos07 అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 73 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. దీనిపై ప్రజలు చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఈ వీడియోపై ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. 'అమ్మాయిపై తల్లి హింసకు పాల్పడ్డారు. తల్లి ఇప్పుడు జైలులో ఉండాలి. అమ్మాయి కూడా ఎక్కువ టైం స్క్రీన్‌కు కేటాయిస్తుంది.' మరొక నెటిజన్ ఇలా రాశాడు, 'మా అమ్మకు ఈ విషయం తెలిసేలోపు దీన్ని తొలగించండి.' అంటు సరదాగా కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ స్పందిస్తూ 'తినే ప్రాంతంలో ఫోన్ వాడకూడదు అని హెచ్చరిక చేశారు .' అని స్పందించారు.





















