Mark Zuckerberg: బేబీబంప్‌తో జుకర్‌బర్గ్ సతీమణి, చిరునవ్వులతో ఇన్‌స్టాలో న్యూ ఇయర్ విషెస్
Mark Zuckerberg: సతీమణితో కలిసి మార్క్ జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
Mark Zuckerberg New Year Wishes:
మరో చిన్నారికి వెల్‌కమ్..
ఫేస్‌బుక్ కో ఫౌండర్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన భార్యతో కలిసి దిగిన ఫోటోతో అందరికీ న్యూ ఇయర్ విషెల్ చెప్పారు. ఈ ఫోటోలో ఆమె బేబీ బంప్‌తో కనిపించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఏడాది మరో చిన్నారికి వెల్‌కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. "హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాది మా ప్రేమకు ప్రతిరూపం వచ్చేస్తోంది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు జుకర్ బర్గ్. బ్లాక్‌సూట్‌లో ఉన్న జుకర్...తన సతీమణి ప్రిసిల్లా చాన్ బేబీ బంప్‌పై చేయి పెట్టి ఫోటో దిగారు. ఇదే పోస్ట్‌లో తన కూతురితో కలిసి దిగిన ఓ క్యాండిడ్
ఫోటోనీ షేర్ చేశారు. దంపతులిద్దరూ నవ్వుతూ కనిపించారు. 2012లో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు. 2015 డిసెంబర్‌లో కూతురు పుట్టింది. ఆ తరవాత 2017లో మరో కూతురికి జన్మనిచ్చింది ఈ జంట. ఆగస్టులో పుట్టిందని...తన కూతురుకి ఆగస్ట్ అనే పేరు పెట్టాడు జుకర్.
View this post on Instagram
తండ్రినవుతున్నా అంటూ గతేడాది పోస్ట్..
గతేడాది సెప్టెంబర్‌లో జుకర్ బర్గ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. మూడో సారి తండ్రి అవుతున్నానని ఆ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన సతీమణి ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు. "మ్యాక్స్, ఆగస్ట్‌కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోంది" అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2012లో ప్రిసిల్లా చాన్‌ను పెళ్లి చేసుకున్నారు జుకర్‌బర్గ్. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట. వాళ్ల పేర్లు మ్యాక్సిమా, ఆగస్ట్. ఇప్పుడు మూడోసారి కూడా కూతురు పుడుతున్నట్టు ప్రకటించారు జుకర్. అమెరికాలో పిల్లలు పుట్టక ముందే లింగనిర్ధరణ చేసుకోవచ్చు. అక్కడ అదేమీ నేరం కాదు. వీళ్లిద్దరూ కాలేజ్‌లో ఉండగానే ప్రేమలో పడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట...2012లో పెళ్లి చేసుకుంది. ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు.
లేఆఫ్‌లు...
మార్క్ జుకర్‌బర్గ్ అన్నంత పనీ చేశారు. ఈ ఏడాదిలో అతిపెద్ద 'లేఆఫ్స్'కు తెరతీస్తూ.. ఉద్యోగాల కోత మొదలుపెట్టారు. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు నవంబరు 9న ప్రకటించారు. తొలి దశలో కంపెనీలో పనిచేస్తున్న 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్ బర్గ్ అభివర్ణించారు. ఇకపై కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామన్నారు. మెటా ఉద్యోగులకు పంపిన మెయిల్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన మేరకు ఈ నిర్ణయాలకు తనదే బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి సంక్లిష్ట సమయమని తనకు తెలుసని, ఈ నిర్ణయం
ప్రభావానికి గురైన వారందరికీ తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ప్రకటనల రాబడి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారిస్తామని, ఈ క్రమంలో వచ్చే ఏడాది తొలి క్వార్టర్ వరకూ నియామకాల ప్రక్రియ నిలిపివేస్తామని చెప్పారు.
Also Read: Instagram: ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూడటం ఎలా?