(Source: ECI/ABP News/ABP Majha)
Manmohan Singh Discharged: ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్ఛార్జ్
దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్ఛార్జ్ అయ్యారు.
దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్ఛార్జ్ అయ్యారు. జ్వరం, నీరసంతో ఇటీవల మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు మన్మోహన్ డిశ్ఛార్జ్ అయ్యారు.
Former PM Dr Manmohan Singh, who was admitted to AIIMS, Delhi earlier this month, has been discharged after treatment
— ANI (@ANI) October 31, 2021
(File photo) pic.twitter.com/9wM1wRSWf7
ఎయిమ్స్ ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో టవర్‌లోని ఓ ప్రైవేట్ వార్డ్‌లో మన్మోహన్ సింగ్ చికిత్స పొందారు. డా. నితీశ్ నాయక్ నేతృత్వంలోని బృందం ఆయనకు చికిత్స అందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ సీఎం కేజ్రివాల్ సహా పలువురు ప్రముఖులు.. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సహా పలువురు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు.
కరోనాతో పోరాటం..
మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత మన్మోహన్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.
Also Read: Pratigya Rally: 70 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ నిర్మిస్తే.. 7 ఏళ్లలో భాజపా అమ్మేసింది: ప్రియాంక గాంధీ
Also Read: National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'
Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!
Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!
Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'
Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?