Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదు కాగా 446 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసులు 15వేల కన్నా తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదు కాగా 446 మంది మరణించారు. 14,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) October 31, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/OedDCFjEuS pic.twitter.com/ZPmBT87Mt9
ప్రస్తుతం రికవరీ రేటు 98.20%గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.46%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
#IndiaFightsCorona:#COVID19Vaccination Status (As on 31st October 2021, 8:00 AM)
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) October 31, 2021
✅Total vaccine doses administered (so far): 1,06,14,40,335
✅Vaccine doses administered (in last 24 hours): 68,04,806#We4Vaccine #LargestVaccinationDrive@ICMRDELHI @DBTIndia pic.twitter.com/B9NUERNCiZ
- మొత్తం కేసుల సంఖ్య: 3,42,73,300
- యాక్టివ్ కేసులు: 1,59,272
- మొత్తం రికవరీలు: 3,36,55,842
- మొత్తం మరణాలు: 4,58,186
- మొత్తం వ్యాక్సినేషన్: 1,06,14,40,335
కేరళ..
కేరళలో కొత్తగా 7,427 కేసులు నమోదుకాగా 62 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 49,61,490కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 31,514కి పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 1,001 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోజికోడ్ (997), ఎర్నాకులం (862) ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,130 కేసులు నమోదుకాగా 26 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 66,09,906కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,40,196కి చేరింది.
వ్యాక్సినేషన్..
భారత్లో టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శనివారం మరో 68,04,806 డోసుల వ్యాక్సిన్ అందించారు. మొత్తం ఇప్పటివరకు 1,06,14,40,335 డోసుల టీకా పంపిణీ జరిగింది.
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?