News
News
X

Viral News : డెత్ సర్టిఫికెట్ కోసం చనిపోయిన వ్యక్తి పేపర్ ప్రకటన - ఇది ఊహించని మిస్టరీ !

ఓ అస్సాం దినపత్రికలో నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. దొరికిన వాళ్లు తెచ్చివ్వండి అంటూ ప్రకటన. అంతే.. ఇక ఇంటర్నెట్ ఊరుకుంటుందా ?

FOLLOW US: 

Viral News :  " ఫలానా చోట.. నా సర్టిఫికెట్లు పోయినవి. ఎవరికైనా దొరికితే తెచ్చివ్వగలరు . దొరికిన వారికి మంచి  బహుమానం ఇవ్వబడును " అని పత్రికల్లో ప్రకటనలు చాలా మందిమి చూసి ఉంటాం. అయితే  నా డెత్ సర్టిఫికెట్ పోయింది. ఎవరికైనా దొరికితే తెచ్చివ్వండి.. కోరిన బ హుమతి ఇస్తాను అని అని ఇచ్చిన ప్రకటన ఎప్పుడూ చూసి ఉండవు. ఒక వేళ చూసినా... ఆ డెత్ సర్టిఫికెట్ దొరికినా... ఆ బ హుమతి సంగతేమో కానీ ముందు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ సర్టిఫికెట్ అక్కడే పడేసి పారిపోతారు. ఎందుకంటే.. చనిపోయిన వ్యక్తి ఎలా తన  డెత్ సర్టిఫికెట్ కోసం ప్రకటన ఇస్తారు ? ఖచ్చితంగా దెయ్యమే ఇచ్చి ఉంటుందనే డౌట్ సహజంగానే వస్తుంది కదా! 
 
అయితే  ఇదేమీ అవాస్తవం కాదు. నిజంగానే ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ కోసం పేపర్ ప్రకటన ఇచ్చాడు.  ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. అస్సాంకు చెందిన రంజిత్‌ కుమార్‌, ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన ‘మరణ ధృవీకరణ పత్రం’ పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఆ డెత్‌ సర్టిఫికేట్‌ నంబర్‌ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్‌ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్‌ ప్రకటన ఫొటోను ట్విట్టర్‌లో ఆదివారం పోస్ట్‌ చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తన డెత్‌ సర్టిఫికేట్‌ను కోల్పోయినట్లు రంజిత్‌ కుమార్‌ పేపర్‌లో ఇచ్చిన ఈ ప్రకటనపై నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా స్పందించారు. ఆ వ్యక్తి స్వర్గంలో ఉన్నాడా? లేక నరకంలో ఉన్నాడా? అని కొందరు అడిగారు. ఒకవేళ ఆ ‘మరణ ధృవీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? అని మరొకరు ఫన్నీగా ప్రశ్నించారు.

‘ఒక వ్యక్తి తన డెత్‌ సర్టిఫికేట్‌ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి. దీనిని అర్జెంట్‌గా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఒకరు కామెంట్‌ చేశారు. ఒక వ్యక్తి తన ‘మరణ ధృవీకరణ పత్రం’ కోల్పోవడం ఇదే తొలిసారి అని మరొకరు చమత్కరించారు.

Published at : 23 Sep 2022 04:32 PM (IST) Tags: Viral News Death Certificate Announcement Assam Announcement

సంబంధిత కథనాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ, ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

Hema Malini On Kangana Ranaut: మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ,  ఎంపీ హేమమాలిని ఏమన్నారంటే?

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు

ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి