KTR: వండర్‌ఫుల్ కేటీఆర్.. నాయకత్వం, వినయం విడదీయరానివని నిరూపిస్తున్నావ్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను పొగుడుతూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను పొగుడుతూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. టెక్ మహీంద్రా సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్ణానికి గొడుగు పట్టిన కేటీఆర్ ఫోటోను ఆయన షేర్ చేశారు. నాయకత్వం, వినయం విడదీయరానివని కేటీఆర్ నిరూపిస్తున్నారని మహీంద్ర కొనియాడారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్..
Wonderful… @KTRTRS you are setting a phenomenal example. You’re demonstrating that leadership and humility are inseparable. 👏🏽👏🏽👏🏽 https://t.co/m4SRRfBSSK
— anand mahindra (@anandmahindra) September 10, 2021
కేటీఆర్ ట్వీట్..
Kind words @anandmahindra Ji 🙏 Thanks https://t.co/nifDnm9jGN
— KTR (@KTRTRS) September 10, 2021
కేటీఆర్.. ఆయన పక్కన నడుస్తూ గొడుకు పట్టుకున్న ఫొటోను సీపీ గుర్ణాని ట్విట్టర్‌లో పంచుకున్నారు.
It was good catching up with you @KTRTRS and humbled by your thoughtful gesture... It's not every day that someone of your stature holds the umbrella for me! pic.twitter.com/QNoe1po44Z
— CP Gurnani (@C_P_Gurnani) September 10, 2021
థ్రిల్ సిటీ పార్క్‌ను ప్రారంభించిన కేటీఆర్..
పీవీ ఘాట్‌రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన థ్రిల్ సిటీ పార్క్ హైదరాబాద్‌కు కానుకగా మారుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వాసులు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేలా ఈ పార్కును తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. విదేశాల్లో మాదిరిగా పలు రకాల గేమ్స్‌ను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ పార్కును రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ, సీపీ అంజనీ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
అన్ని రకాల వయసుల వారికి వినోదాన్ని అందించే విధంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో హెచ్‌ఎండీఏ, థ్రిల్ సిటీ ఈ పార్క్‌ను రూపొందించాయి. ఇందులో స్లాష్ కో స్టార్, వీఆర్ రోలర్ కోస్టర్, మాన్ట్సర్ రైడ్, ఫ్లైట్ స్టిములేటర్, మ్యూజిక్ ట్రైన్, బంపర్ కార్స్, వంటి గేమ్స్‌తో పాటు పలు రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.
Also Read: Sai Dharam Tej Accident: మెగా నటుడు సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపస్మారక స్థితిలోకి సుప్రీం హీరో