Maharashtra Politcal Crisis: శివసేన కార్యకర్తలు వీధుల్లోకి వస్తే సీన్ వేరేలా ఉంటుంది, షిండేకి సంజయ్ రౌత్ వార్నింగ్
ఉద్దవ్ థాక్రే రాజీనామా చేయరని, శివసేన పార్టీ చివరి వరకూ పోరాడుతుందని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు.
ఉద్దవ్ థాక్రే రాజీనామా చేయరు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే మధ్య వైరం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అటు డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్...షిండే శిబిరంలోని 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నోటీసులు పంపారు. ఇటు ఏక్‌నాథ్ షిండే, ప్రభుత్వంపై తరచు ఆరోపణలు చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలకు శివసేన భద్రతను తొలగించిందని, కావాలనే కక్ష తీర్చుకుంటోందని విమర్శించారు. అలాంటిదేమీ లేదని, నిరాధార ఆరోపణలు చేయటం తగదని శివసేన వివరణ ఇచ్చింది. షిండే, ఉద్దవ్ థాక్రే ఈ పరిణామాల నేపథ్యంలోనే తప్పు మీదంటే మీదంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. శివసేన తరపున ఉద్దవ్ థాక్రేతో పాటు సీనియర్ నేత
సంజయ్ రౌత్ కూడా విరుచుకుపడుతున్నారు. చెప్పాలంటే థాక్రే కన్నా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. షిండే శిబిరంలోకి వెళ్లిన నేతలపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో స్పందించారు.
నిప్పంటుకుంటే అంత తొందరగా చల్లారదు..
ఉద్దవ్ థాక్రే ససేమిరా రాజీనామా చేయరని, ఈ కుట్రను ఇక్కడితో ఆపకపోతే శివసేన సైనికులను వీధుల్లోకి దింపాల్సి వస్తుందనిహెచ్చరించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. చివరి వరకూ శివసేన పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. "ఇది నా ఒక్కడి కోపమే కాదు. మొత్తం శివసేన ఎమ్మెల్యేల ఆగ్రహం. ఒక్కసారి నిప్పంటుకుంటే అది అంత తొందరగా చల్లారదు" అని అన్నారు సంజయ్. శివసేన కార్యకర్తలు ఇప్పటికే రెబల్ నేతల కార్యాలయాలపై దాడులు మొదలు పెట్టారు. పుణేలో రెబల్ నేత తనాజీ సావంత్ ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ముంబయికి వచ్చి నేరుగా తమతో తలపడాలంటూ సంజయ్ రౌత్ సవాలు విసిరారు.
#WATCH | Shiv Sena workers vandalise office of the party's MLA Tanaji Sawant in Balaji area of Katraj, Pune. Sawant is one of the rebel MLAs from the state and is currently camping in Guwahati, Assam. #MaharashtraPoliticalCrisis pic.twitter.com/LXRSLPxYJC
— ANI (@ANI) June 25, 2022
Our party worker vandalised Tanaji Sawant's office. All traitors and rebel MLAs who have troubled our chief Uddhav Thackeray will face this type of action. Their office will also be attacked... No one will be spared: Sanjay More, Pune city head, Shiv Sena
— ANI (@ANI) June 25, 2022
Also Read: Weight Loss: డైటింగ్ చేస్తున్నారా? ఏడాదిలో 40 కిలోల బరువు తగ్గిన ఈమెను చూస్తే వణికిపోతారు!
Also Read: RBI Blockchain: నీరవ్ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్ చైన్' వల పన్నుతున్న ఆర్బీఐ!