By: ABP Desam | Updated at : 25 Jun 2022 03:58 PM (IST)
Image Credit: Pexels
బరువు పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనే విషయం మనకు తెలిసిందే. కానీ, బరువు తగ్గడం కోసం అతిగా డైటింగ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు. బరువు తగ్గింకోడానికి వ్యాయామం, యోగా, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడం ఒక్కటే సరైన మార్గం. అలా కాకుండా కడుపు మాడ్చుకుని బరువు తగ్గిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ మహిళ తరహాలోనే చిక్కుల్లో పడతారు. బాగా చిక్కిపోయి అస్థిపంజరంలా మారిపోతారు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే మీరు చైనాకు చెందిన ఈ మహిళ గురించి తెలుసుకోవాల్సిందే.
చైనాలోని హెబీ ప్రావిన్స్‌కు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ(పేరు వెల్లడించలేదు) కేవలం ఏడాది వ్యవధిలోనే 40 కిలోల బరువు కోల్పోయింది. రెండవ బిడ్డను ప్రసవించిన తర్వాత, ఆమె బరువు 65 కేజీలకు చేరుకుంది. దీంతో ఆమె డైటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఏడాదిలోనే ఆమె తన శరీర బరువును సగానికి పైగా కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో హెంగ్‌షుయ్ నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది.
25 కేజీల బరువుతో.. నడుస్తున్న అస్థిపంజరాన్ని తలపించేలా ఉన్న ఆమెను చూసి వైద్యులు షాకయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇది కేవలం ఆహారపు అలావాట్ల వల్ల ఏర్పడే వ్యాధి. అప్పటికే ఆమె ఆరోగ్యంపై ఆ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల ఆమె అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. జుట్టు రాలడం, జీర్ణాశయం, గుండె సమస్యలతో బాధపడుతోంది. రుతుక్రమం ఆగిపోయింది. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు స్పందిస్తూ.. ‘‘బాధితురాలికి ‘అనోరెక్సియా నెర్వోసా’ ఉంది. ఆమె గత కొన్నాళ్లుగా ఆహారం ముట్టడం లేదు. ఫలితంగా అవయవాల వైఫల్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఐసీయుకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఆమె ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య పరిస్థితి గురించి చెప్పాం. జీవనశైలిలో మార్పులు అవసరమని తెలిపాం. కానీ, ఆమెకు అందుకు ఆసక్తి చూపడం లేదు. ట్రీట్మెంట్‌ను కూడా తిరస్కరించింది. బరువు తగ్గడం కోసం ఆమె ఆహారం మానేయడమే కాదు.. క్యాతార్టిక్స్, లాక్సిటివ్స్, ఆక్యుపంక్చర్ తదితర పద్ధతులను ప్రయత్నించానని మాకు తెలిపింది’’ అని పేర్కొన్నారు. ఈమె పరిస్థితి గురించి తెలుపుతూ.. అక్కడి వైద్యులు చైనా యువతుల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా సంస్కృతిలో సన్నగా ఉండే అమ్మాయిలనే అందంగా ఉన్నట్లు పరిగణిస్తారు.
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!
Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!
Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?
Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు