News
News
X

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

బాలాసాహెబ్‌ విజన్‌కు అనుగుణంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తానని సీఎం షిండే హామీ ఇచ్చారు.

సీఎం అవుతానని షిండే కూడా ఊహించి ఉండడని శరద్ పవార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

సీఎంగా షిండే...ఎవరూ ఊహించని ట్విస్ట్..

మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సీఎం సీటు దక్కించుకున్నారు ఏక్‌నాథ్ షిండే. అసలైన శివసేన ఇదేనని ప్రచారం చేసుకుంటున్నారు. భాజపా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఊహించినా అనుకోకుండా చివర్లో ట్విస్ట్ ఇచ్చింది కాషాయ పార్టీ. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఫడణవీస్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోవా వెళ్లారు షిండే. తనకు మద్దతు తెలిపిన వారందరితోనూ సమావేశమయ్యారు. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలిరోజే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బాలాసాబెబ్ థాక్రే సిద్ధాంతాలు నమ్మే శివసైనిక్‌" ముఖ్యమంత్రి 
అవటం పట్ల మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన ఆ 50 మంది ఎమ్మెల్యేల వల్లే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు. 
 
షిండే కూడా ఊహించి ఉండడు: శరద్ పవార్

ఈ పరిణామాలు జరుగుతుండగానే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం చేయటాన్ని దేవేంద్ర ఫడణవీస్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. "నెంబర్ 2 పొజిషన్‌లో ఉండటం ఫడణవీస్‌కు ఇష్టం లేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత అసంతృప్తితో ఉన్నారో" అంటూ కామెంట్ చేశారు పవార్. ఫడణవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పని చేశారని, అధిష్ఠానం ఎలా చేయమంటే అలా చేయటం ఆయన పని అని వ్యాఖ్యానించారు. "ఇది నిజంగా సర్‌ప్రైజ్. నాకు తెలిసి రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ లీడర్ సీఎం అవుతారని ఊహించి ఉండరు. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే..ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగాపని చేసిన ఫడణవీస్‌కు డిప్యుటీ సీఎం ఇవ్వటం" అని అన్నారు శరద్ పవార్. 

బాలాసాహెబ్ బాటలోనే..

అటు మాజీ ముఖ్యంత్రి ఉద్దవ్ థాక్రే కూడా కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. "కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఏక్‌నాథ్ షిండేకి, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు అభినందనలు. మహారాష్ట్రకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక సీఎం ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజునే అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నుకోనున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఏవైతే ఆశించారో, ఆ పనులన్నింటినీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే షిండే ప్రకటించారు. బాలాసాహెబ్ థాక్రే విజన్‌కు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు షిండే. అందరితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని దాట వేస్తున్నారు. 

Published at : 01 Jul 2022 09:57 AM (IST) Tags: maharashtra news Maharashtra Politics CM Shinde BJP in Maharashtra

సంబంధిత కథనాలు

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Karnataka Accident : కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్