Covid 19 Update: మహారాష్ట్రలో కరోనా కల్లోలం... అహ్మద్ నగర్ లోని పాఠశాలలో 48 మంది విద్యార్థులు, 3 సిబ్బందికి కోవిడ్
మహారాష్ట్రలో కొత్తగా 1648 కరోనా కేసులు నమోదయ్యాయి. అహ్మద్ నగర్ జిల్లాలో ఓ పాఠశాలలో 48 మంది విద్యార్థులు, 3 సిబ్బంది కరోనా బారిన పడ్డారు.
దేశంలో ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తుంటే.. మరోపక్క కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఒక పాఠశాలలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకింది. అహ్మద్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర భోసలే మాట్లాడుతూ..అహ్మద్‌నగర్‌లోని తక్లి ధోకేశ్వర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయలో 48 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించారన్నారు. ఆదివారం ఉదయం చేసిన కరోనా పరీక్షల్లో 19 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు తేలిందన్నారు. తాజాగా ఈ సంఖ్య 48కి చేరిందన్నారు. విద్యార్థులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
#COVID19 | Maharashtra reports 1,648 new cases, 918 recoveries and 17 deaths today. Active cases 9,813
— ANI (@ANI) December 26, 2021
31 new #Omicron cases were reported in the state; till date, a total of 141 Omicron cases have been reported in the State pic.twitter.com/EO748wUjte
కొత్తగా 1648 కరోనా కేసులు
మహారాష్ట్రలో తాజాగా 1648 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనా కారణంగా మరణించారు. గడచిన 24 గంటల్లో 918 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 31 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 141కు చేరాయి.
Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా?
దిల్లీలో నైట్ కర్ఫ్యూ
Night curfew to be imposed in Delhi from tomorrow (Dec 27) from 11:00 PM to 5:00 AM, in view of the rapidly increasing #COVID19 cases: Delhi Govt pic.twitter.com/0EV54oiJRI
— ANI (@ANI) December 26, 2021
దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27 నుంచి రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. రాత్రి 11.00 నుంచి ఉదయం 5.00 వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించింది. దిల్లీలో ఆదివారం 290 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జూన్ 10 నుంచి ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే ప్రథమం. పాజిటివిటీ రేటు 0.55 శాతం పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దిల్లీలో ఇప్పటివరకు 14,43,352 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో 25,105 మరణాలు నమోదయ్యాయి.
Also Read: PM Kisan Yojana: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి