By: Ram Manohar | Updated at : 06 Jan 2023 12:13 PM (IST)
మధ్యప్రదేశ్‌లో ఓ విమానం ఆలయ గోపురాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. (Image Credits: ANI)
Madhya Pradesh Plane Crash:
మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో విమానం ఓ ఆలయంలో కుప్ప కూలింది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రైనింగ్‌లో భాగంగా ప్లేన్ నడుపుతుండగా...ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా...మరో ట్రైనీ పైలట్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఉమ్రి గ్రామంలో ఓ ఆలయ గోపురాన్ని ఢీకొట్టి విమానం కుప్ప కూలింది. Falcon Aviation Academyకి చెందిన విమానంగా గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పైలట్లకు ట్రైనింగ్ ఇస్తోంది ఈ అకాడమీ. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం...అర్ధరాత్రి 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన పైలట్‌ను కేప్టెన్ విమల్ కుమార్‌గా గుర్తించారు. గాయపడ్డ ట్రైనీ పైలట్ సోను యాదవ్‌గా నిర్ధరించారు. మంచు కురుస్తున్న కారణంగా...ఆలయ గోపురం కనిపించలేదని అందుకే ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిన పైటల్ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Madhya Pradesh | A pilot died while another was injured after a plane crashed into a temple in Rewa district during the training: Rewa SP Navneet Bhasin pic.twitter.com/KumJTAlALs
— ANI (@ANI) January 6, 2023
తరచూ ప్రమాదాలు..
గతేడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ సైనిక హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ హెలికాప్టర్ కూలే ముందు పైలట్ "Mayday" కాల్ ఇచ్చినట్టు తేలింది. మేడే కాల్ అంటే...ఏదైనా ప్రమాదం జరిగే సూచన ఉన్నప్పుడు రేడియో ద్వారా పైలట్ సమాచారం అందించటం. ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా..వెంటనే ఆ రేడియో ద్వారా పైలట్ అలర్ట్ చేస్తాడు. ఈ ప్రమాదం జరిగే ముందు Air Traffic Control (ATC)కి కాల్ చేశాడు పైలట్. టెక్నికల్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చని చెప్పాడు. అంతలోనే హెలికాప్టర్ కుప్ప కూలింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. నిజానికి వాతావరణ పరిస్థితులు హెలికాప్టర్ఎగరటానికి అనకూలంగానే ఉంది. పైగా...ఆ పైలట్‌కు ఎంతో అనుభవం కూడా ఉంది. అయినా...ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల హెలికాప్టర్ కూలిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అక్టోబర్ 18న ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఫాటా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
Also Read: Hyderabad news: "నాకు క్యాన్సర్ ఉందని తెలుసు, అమ్మ నాన్నకు చెప్పకండి" - ఓ డాక్టర్ చెప్పిన ఆరేళ్ల చిన్నారి కన్నీటి కథ
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?