Madhya Pradesh News: తల్లి డెడ్‌బాడీతో బైక్‌పై 80 కిలోమీటర్లు ప్రయాణం - ఇంత దారుణమా అంటున్న స్థానికులు
Madhya Pradesh News: మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు తమ తల్లి మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని స్వగ్రామానికి తరలించారు. ఆంబులెన్స్ ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించటం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది.
Madhya Pradesh News :
చెక్క కొనుక్కుని, తల్లి మృతదేహం కట్టుకుని..
మధ్యప్రదేశ్‌లో ఇటీవలే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చి పెద్ద వివాదమే అయింది. ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వటం పెను దుమారమే రేపింది. ఆ ఘటన మరిచిపోక ముందే మరో దారుణ ఘటన జరిగింది. షాదోల్ జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు తమ తల్లి మృతదేహాన్ని బైక్‌పైనే కట్టుకుని దాదాపు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. జిల్లా ఆసుపత్రిలో తల్లి మృతి చెందగా, ఆసుపత్రి సిబ్బంది తన గ్రామానికి తీసుకుని వెళ్లేందుకు ఆంబులెన్స్‌ను ఇవ్వలేదు. ప్రైవేట్ ఆంబులెన్స్ వాళ్లను అడిగితే రూ.5,000 ఖర్చవుతుందని చెప్పారు.
అంత పెద్ద మొత్తం ఖర్చు చేయలేక, ఆ మృతదేహాన్ని బండిపైనే తన స్వగ్రామానికి తీసుకు వెళ్లారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్య సిబ్బంది సరిగా పట్టించుకోలేదని, తన తల్లి మరణానికి వాళ్ల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రూ.100 ఖర్చు చేసి ఓ చెక్కను కొనుగోలు చేసి, దానికి తమ తల్లి మృతదేహాన్ని కట్టుకుని వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు.
किसी भी राज्य में मंत्रिमंडल क्यों हो,अगर हां तो तस्वीर क्यों नहीं बदलती ये शहडोल का छोटा अस्पताल नहीं मेडिकल कॉलेज हैं बेटे अपनी मां का शव बाइक पर ले जा रहे हैं @ChouhanShivraj इसके बाद भी स्वास्थ्य मंत्री के तर्क हो सकते हैं! आपलोग सिर्फ चुनाव विभाग रखें जो काम साल भर करते हैं pic.twitter.com/NJ9NvoWDsv
— Anurag Dwary (@Anurag_Dwary) August 1, 2022
ఏం జరిగిందంటే..?
గొడారు గ్రామానికి చెందిన జైమంత్రి యాదవ్ ఛాతి నొప్పితో జిల్లా ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించటం వల్ల మెడికల్ కాలేజీకి తరలించారని అక్కడి వైద్యులు సూచించారు. వెంటనే మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ...అక్కడి నర్స్‌లు కానీ, వైద్యులు కానీ తమ తల్లిని ఏ మాత్రం పట్టించుకోలేదని, ఆమె చనిపోవటానికి కారణం ముమ్మాటికీ ఇక్కడి సిబ్బందేనని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం ఇవ్వాలని ఎంత అడిగినా, ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా స్పందించారు. ఈ మెడికల్ కాలేజీలో ఎవరికీ సరైన వైద్యం అందటం లేదని విమర్శించారు.