Lucknow Wall Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం- ప్రహారీ గోడ కూలి 9 మంది మృతి!
Lucknow Wall Collapse: లఖ్‌నవూలో భారీ వర్షానికి ప్రహారీ గోడ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు.
Lucknow Wall Collapse: ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. శిథిలాల నుంచి ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
UP | Nine people dead and 2 injured after a wall collapsed due to heavy rain in Lucknow. The incident took place in Dilkusha under Cantt: Home Department pic.twitter.com/Kxmml42KBe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2022
పరిహారం
గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
Unnao, UP | Three including 2 minors were killed while one was injured after roof of a house collapsed due to rain late last night. Injured has been identified as the mother of three children aged 20 years, 4 years & 6 years all of whom died in incident. Senior officials on spot pic.twitter.com/Ve8g1kbXa4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2022
ఇక ఉన్నావ్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు.
Also Read: Watch Video: ఈ వీడియో చూడండి- హెల్మెట్ విలువ తెలుస్తుంది!
Also Read: Odisha News: ఫుల్లుగా తాగి ASP వీరంగం- మహిళలతో అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్!