అన్వేషించండి

Odisha News: ఫుల్లుగా తాగి ASP వీరంగం- మహిళలతో అసభ్య ప్రవర్తన, వీడియో వైరల్!

Odisha News: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి పోలీసు ఉన్నతాధికారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Odisha News: రక్షించాల్సిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఒడిశాలో జరిగింది. అందులోనూ ఆ పోలీసు ఓ జిల్లాకు ఉన్నతాధికారి కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆ పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇదీ జరిగింది

బరగఢ్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆ జిల్లా ఏఎస్పీ జయకృష్ణ బెహరాను కలిశారు. దీంతో ఆయన యువతి ఉన్న ప్రాంతాన్ని తెలుసుకున్న ఏఎస్‌పీ బుధవారం సాయంత్రం బలవంతంగా ఆమెను తన వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. 

దాడి

బలవంతంగా తనను తీసుకువెళ్తుండటంతో ఆ యువతి కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు, అక్కడికి వచ్చిన పాత్రికేయులు ఈ ఘటనను ఫోన్‌లలో చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది గమనించిన ఏఎస్పీ ఆగ్రహంతో ఊగిపోయారు. లాఠీలతో పాత్రికేయులపై దాడి చేశారు. అడ్డుకొన్న సమీపంలోని మహిళలను కూడా చితకబాదారు. 

వారించిన సిబ్బందిని కూడా అసభ్య పదజాలంతో దూషించారు. ఏఎస్పీ దగ్గర నుంచి మద్యం వాసన రావడంతో అడ్డుకోవడానికి వచ్చిన స్థానిక మహిళలు కూడా దూరంగా జరిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం బాధిత మహిళను రహస్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. వెంటనే పాత్రికేయులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని, ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుకున్న కలెక్టర్‌ భాస్కర్‌ రైతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఆందోళన

బాధిత యువతితో పాటు అడ్డుకోవాడనికి వెళ్లిన మహిళల శరీర భాగాలను తాకుతూ ఏఎస్పీ జయకృష్ణ బెహరా వీరంగం సృష్టించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కాంగ్రెస్, భాజపా నేతలు నిరసన చేపట్టారు. తక్షణమే ఏఎస్పీని విధుల నుంచి తొలగించి, చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  మహిళను అగౌరవ పరిచిన అధికారిపై చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఆసుపత్రికి

ఈ విషయం తెలుసుకన్న ఏఎస్‌పీ అనారోగ్యంతో గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరడం అసలు ట్విస్ట్. బాధిత మహిళను పోలీసులు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్‌పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్‌ జిల్లా ఎస్పీ వరుణ్‌ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Also Read: PM Modi Birthday Special: BJP బంపర్ ఆఫర్- మోదీ బర్త్‌డేకు బంగారు ఉంగరాలు, చేపలు పంపిణీ!

Also Read: Pakistan Economic Crisis: మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారు, మిత్ర దేశాలదీ ఇదే తీరు - పాక్ ప్రధాని అసహనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Universal Pension Scheme: సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
సార్వత్రిక పింఛన్‌ పథకంతో ఉన్న స్కీమ్స్‌ పోతాయా? - మోదీ ప్రభుత్వం ఆలోచన ఏంటీ?
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
Embed widget