News
News
X

PM Modi Birthday Special: BJP బంపర్ ఆఫర్- మోదీ బర్త్‌డేకు బంగారు ఉంగరాలు, చేపలు పంపిణీ!

PM Modi Birthday Special: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు భాజపా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

FOLLOW US: 

PM Modi Birthday Special: సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. దీంతో ప్రధాని జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపేందుకు భాజపా ఇప్పటికే ప్లాన్ చేసింది. అయితే తమిళనాడు భాజపా తాజాగా ఓ భారీ ప్రకటన చేసింది. అదేంటంటే..

బంపర్ ఆఫర్

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున జన్మించిన ప్రతి శిశువుకు ఓ బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు తమిళనాడు భాజపా ప్రకటించింది. ఈ పథకం కింద 720 కిలోల చేపలను కూడా పంపిణీ చేయనున్నారు.

ఈ పథకం కోసం పార్టీ ఆర్‌ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రిని ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్ తెలియజేశారు.

" ప్రతి ఉంగరం 2 గ్రాముల బరువు ఉంటుంది. అయితే ఇది ఉచిత పథకం కాదు.  పార్టీ కేవలం అప్పుడే పుట్టిన పసికందులకు ఘనంగా స్వాగతం పలకాలని కోరుకుంటోంది. సెప్టెంబర్ 17న ఆసుపత్రిలో 10-15 మంది పిల్లలు పుడతారని భావిస్తున్నారు.                                                 "
-ఎల్‌ మురుగన్, కేంద్ర మంత్రి

చేపల పంపిణి

ఉంగరాలతో పాటు చేపల పంపిణీ కూడా చేపట్టనున్నట్లు మురుగన్ తెలిపారు. అయితే చేపలు పంపిణీ చేసేందుకు సీఎం ఎంకే స్టాలిన్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. చేపల వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యమన్నారు. మోదీకి 72 ఏళ్లు అవుతున్నందున 720 కిలోల చేపలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వీటితో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు భాజపా నేతలు వెల్లడించారు.

దిల్లీలో

దిల్లీలో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక రేసును కూడా ప్రకటించనున్నారు. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 

టైగర్లు కూడా

మరోవైపు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరుతల సంఖ్య పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫ్రికా నుంచి చింటూ చీతాను ఇండియాకు తీసుకురానున్నారు. అది కూడా మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న రానుండటం విశేషం.

ప్రస్తుతం అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చిరుతలు ముందు వరసలో ఉంటాయి. వీటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో అయితే పెరగటం లేదు. కానీ భారత్ మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపటం లేదు. ఇందులో భాగంగానే...ఆఫ్రికా నుంచి చింటూ చీతాను (Chintu Cheetah)ను మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh)తీసుకురానున్నారు. కునో-పల్‌పూర్ (Kuno-Plpur) ఫారెస్ట్‌లో ఈ చీతాను వదలనున్నారు.

దాదాపు 5 దశాబ్దాలుగా ఈ చీతాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఆ కల నెరవేరనుంది. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా ఈ చింటు చీతాలు మధ్యప్రదేశ్‌లోని ఫారెస్ట్‌లో అడుగు పెట్టనున్నాయి.

Also Read: Pakistan Economic Crisis: మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారు, మిత్ర దేశాలదీ ఇదే తీరు - పాక్ ప్రధాని అసహనం

Also Read: FM Nirmala Sitharaman: హిందీ మాట్లాడాలంటే వణికిపోతాను, సరిగా నేర్చుకోలేకపోయా - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Published at : 16 Sep 2022 11:14 AM (IST) Tags: PM Narendra Modi's Birthday Special Tamil Nadu BJP Gold Rings For Infants Born PM Modi Birthday Special

సంబంధిత కథనాలు

Dengue Cases In Delhi: దిల్లీలో డెంగ్యూ దడ- వారంలో 400 కొత్త కేసులు నమోదు!

Dengue Cases In Delhi: దిల్లీలో డెంగ్యూ దడ- వారంలో 400 కొత్త కేసులు నమోదు!

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంటే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు

Nobel Prize 2022: సైంటిస్ట్ స్వాంటే పాబోను వరించిన నోబెల్, మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు అవార్డు

Uttar Pradesh: డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పై కుప్పకూలిన వ్యక్తి- వీడియో వైరల్!

Uttar Pradesh: డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పై కుప్పకూలిన వ్యక్తి- వీడియో వైరల్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam