News
News
X

Liz Truss Resigns: ఆ ఒక్క నిర్ణయమే పడగొట్టిందా? లిజ్ ట్రస్‌ రాజీనామాకు కారణాలెన్నో!

Liz Truss Resigns: ప్రధాని పదవి నుంచి లిజ్ ట్రస్ తప్పుకోవటం వెనక ఎన్నో కారణాలున్నాయి.

FOLLOW US: 

Liz Truss Resigns: 

ఇవీ కారణాలు..

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు లిజ్ ట్రస్. రాజకీయ సంక్షోభానికి తెర దించుతారని భావిస్తే...ఆమె వచ్చాక కూడా అదే అనిశ్చితి కొనసాగింది. సంపన్నుల పన్ను కోత విషయంలో ఆమె మాట తప్పడం, మినీ బడ్జెట్‌ విషయంలో విమర్శలు రావటం లాంటి పరిణామాలు ఆమెకు రాజీనామా తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. అత్యంత తక్కువ కాలం పాటు పదవిలో ఉన్న ప్రధానిగానూ ఆమె చరిత్రలో నిలిచిపోయారు. ఇంత తొందరగా...ఆమె పదవి నుంచి దిగిపోవటానికి ఎన్నో కారణాలున్నాయి. 

1. పన్ను తగ్గించినట్టే తగ్గించి వెనక్కి తీసుకోవడం: 

News Reels

లిజ్ ట్రస్‌ చేసిన ప్రధాన తప్పిదం "సంపన్నులకు పన్ను తగ్గించటం". ఇందుకోసం 45 బిలియన్ డాలర్ల ప్యాకేజ్ ప్రకటించారు. అప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ఇంకాస్త గండి కొట్టింది. ఎలాంటి ఆలోచన చేయకుండా...నిర్ణయం తీసేసు కున్నారు ట్రస్. ఫలితంగా...మార్కెట్‌లో పెద్ద కలకలం రేగింది. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఫలితంగా...ఆమె ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 

2.పౌండ్ విలువ దారుణంగా పడిపోవటం: 

అనాలోచితంగా పన్ను కోత విధించటం వల్ల ఉన్నట్టుండి పౌండ్ విలువ పడిపోయింది. డాలర్‌తో పోల్చి చూస్తే...ఎన్నడూ లేనంతగా విలువ తగ్గిపోయింది. వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పందించి అప్రమత్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలక ముందే మేలుకోవాలని హెచ్చరించింది. 

3. సన్నిహితులకు కీలక పదవులివ్వడం: 

ప్రతిపక్షాలను ఏ మాత్రం సంప్రదించకుండానే..తన సన్నిహితులను కీలక పదవుల్లో నియమించుకున్నారు లిజ్ ట్రస్. నియామకాలన్నీ ఆమె చెప్పినట్టే జరగాలన్న కండీషన్ కూడా పెట్టారు. ఇది క్రమంగా ఆగ్రహానికి దారి తీసింది. అప్పటి వరకూ పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్లు, పదవి ఆశించిన వాళ్లు ఈ నిర్ణయంతో అవమానంగా ఫీల్ అయ్యారు. ఒకేసారి 100 మంది ఎంపీలు ఆమెకు ఎదురు తిరిగారు. ఆమె పదవి నుంచి తప్పుకోవాలంటూ లేఖ రాశారు. 

4.ముఖ్యమైన మంత్రులు వెళ్లిపోవటం:

45 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి Kwasi Kwarteng ప్రవేశపెట్టిన ఓ ఎకనామిక్ ప్రోగ్రామ్ కారణంగా సమస్యలు తలెత్తాయని వెంటనే రాజీనామా చేయించాలని లిజ్ ట్రస్‌పై ఒత్తిడి పెరిగింది. చేసేదేమీ లేక ఆమె ఆర్థిక మంత్రిని తొలగించాల్సి వచ్చింది. ఆ తరవాత భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (42) తన పదవికి రాజీనామా చేశారు. బ్రిట‌న్ హోం మంత్రిగా బ్రేవర్మన్ ఇటీవలే నియ‌మితుల‌య్యారు. భార‌త సంత‌తికి చెందిన మరో మ‌హిళ ప్రీతి ప‌టేల్ స్థానంలో న్యాయవాది బ్రెవ‌ర్మాన్ ఆ బాధ్య‌త‌ల్ని స్వీకరించారు. అయితే ఓ చిన్న తప్పిదం చేయడం వల్ల నైతికంగా బాధ్యత వహిస్తూ బ్రేవర్మాన్ తన పదవికి రాజీనామా చేశారు. లిజ్ ట్రస్, సుయెల్లా మధ్య విభేదాలు తలెత్తడం వల్లే ఆమె రాజీనామా చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. 

Also Read: Viral Video: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన వైద్యులు- బాధితుడు మృతి!

Published at : 21 Oct 2022 11:05 AM (IST) Tags: UK PM Liz Truss Britain Prime Minister Liz Truss Resigns

సంబంధిత కథనాలు

TS Kanti Velugu Jobs:  'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

TS Kanti Velugu Jobs: 'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌కు ఊరట

Zombie Virus: 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ వెలుగులోకి, గడ్డకట్టిన సరస్సులో కనుగొన్న సైంటిస్ట్‌లు

Zombie Virus: 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ వెలుగులోకి, గడ్డకట్టిన సరస్సులో కనుగొన్న సైంటిస్ట్‌లు

Watch Video: వెంట పడిన జనం- వెనక్కి తరిమిన గజరాజు! వైరల్ వీడియో

Watch Video: వెంట పడిన జనం- వెనక్కి తరిమిన గజరాజు! వైరల్ వీడియో

Medaram Mini Jathara: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం  మినీ జాతర, ఏర్పాట్లు చేస్తున్న అధికారులు!

Medaram Mini Jathara: ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం  మినీ జాతర, ఏర్పాట్లు చేస్తున్న అధికారులు!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్- 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్-  22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్