Viral Video: రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన వైద్యులు- బాధితుడు మృతి!
Viral Video: డెంగ్యూతో బాధపడుతోన్న ఓ రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఘటన కలకలం రేపుతోంది.
Viral Video: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. డెంగ్యూతో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మా పేరుతో బ్లడ్ బ్యాంక్ బత్తాయి జ్యూస్‌ను సరఫరా చేసింది. వైద్యులు కూడా రోగికి దీన్నే ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు వైరల్ అవుతోన్న వీడియోలో తెలిపారు. డెంగ్యూతో బాధపడుతోన్న రోగికి ఇక్కడ బ్లడ్ ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్‌ను సరఫరా చేస్తున్నారని అందులో ఆరోపించారు. ఇదే జ్యూస్‌ను ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని వీడియోలో తెలిపారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
प्रयागराज में मानवता शर्मसार हो गयी।
— Vedank Singh (@VedankSingh) October 19, 2022
एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया।
मरीज की मौत हो गयी है।
इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేస్తున్నారనే వార్తలు రావడంతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేశ్ సింగ్ తెలిపారు.
ప్రభుత్వం ఆగ్రహం
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ స్పందించారు.
Also Read: Diwali 2023 New York City: అమెరికాలోని ఆ నగరంలో దీపావళికి సెలవు, లోకల్ హాలిడేను తొలగించి మరీ నిర్ణయం