Diwali 2023 New York City: అమెరికాలోని ఆ నగరంలో దీపావళికి సెలవు, లోకల్ హాలిడేను తొలగించి మరీ నిర్ణయం
Diwali 2023 New York City: అమెరికాలోని న్యూయార్క్‌లో వచ్చే ఏడాది నుంచి దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు.
Diwali 2023 New York City:
న్యూయార్క్‌లో వచ్చే ఏడాది నుంచి..
దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవునీ ప్రకటించాయి. విదేశాల్లోనూ తెలుగు ప్రజలు స్థిర పడుతున్నారు. అక్కడా భారతదేశ పండుగలు ఘనంగా చేసుకుంటున్నారు. విదేశీయులకూ ఈ పండుగల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే...అమెరికాలోని న్యూయార్క్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి పబ్లిక్ స్కూల్స్‌కు దీపావళికి సెలవు ఇస్తామని వెల్లడించింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ప్రకటన చేశారు. ప్రజల ఐకమత్యానికి ఇదెంతో ఉపకరిస్తుందని, ఎప్పటి నుంచో తమకు ఈ ఆలోచన ఉందని చెప్పారు. సెలవు ప్రకటించడం ద్వారా చిన్నారులు ఈ వెలుగుల పండుగ గురించి తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్ రాజ్‌కుమార్ దీపావళికి అధికారిక గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్‌లోని స్కూల్స్‌కి వచ్చే ఏడాది నుంచి దీపావళికి సెలవు ప్రకటిస్తారు. "ఈ సెలవు ప్రకటించటం వెనక మా ఉద్దేశం ఒకటే. వీలైనంత ఎక్కువ మంది ఈ పండుగ జరుపుకోవాలి" అని వెల్లడించారు. "విద్యార్థుల్లో అవగాహన పెంచటానికీ అది సరైన సమయం అనిపిస్తోంది. వాళ్లకు సెలవు ఇచ్చి వేడుకలు జరుపుకునే విధంగా సహకరిస్తే..వాళ్లు ఆ పండుగ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు..? అన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? ఆ వెలుగుని మనలో ఎలా నింపుకోవాలి..?" అనే విషయాలు వాళ్లకు అర్థమయ్యేలా వివరించేందుకూ వీలవుతుందని మేయర్ అన్నారు. ఈ మేరకు పబ్లిక్ స్కూల్స్ క్యాలెండర్లలోనూ మార్పులు చేశారు. సాధారణంగా...అమెరికాలో జూన్ మొదటి గురువారం "Anniversary Day" జరుపుకుంటారు. దీన్నే "Brooklyn-Queens Day"గానూ పిలుస్తారు. అయితే...ఈ డే బదులుగా "దీపావళి"కి సెలవు ప్రకటించారు.
Diwali will be a public school holiday in New York City starting 2023 with Mayor Eric Adams saying this sends a message about the significance of the city's inclusiveness and the “long overdue” step will encourage children to learn about the Festival of Lights #Diwali pic.twitter.com/BcA2K2o9Cj
— Rakesh Malhotra (@RakeshMalhotra) October 21, 2022
హిందువులకు ప్రాధాన్యత..
దాదాపు 1829 నుంచి బుక్స్‌లో ఈ "యానివర్సరీ డే" కి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. 1900 మధ్య కాలంలో పబ్లిక్ స్కూల్స్ అన్నింటికీ సెలవు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే..దీనిపై వివరణ ఇచ్చారు జెనిఫర్ రాజ్‌కుమార్. "న్యూయార్క్‌లో ఉన్న 2 లక్షల మంది హిందువులను
గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వీరిలో హిందువులతో పాటు బుద్ధులు, సిక్కులు, జైనులున్నారు. వీళ్లంతా దీపావళి జరుపుకుంటారు. వాళ్లకు గౌరవమిస్తూ తీసుకున్న నిర్ణయం ఇది" అని వెల్లడించారు. యానివర్సరీ డే కన్నా దీపావళికి అధిక ప్రాధాన్యత ఉందని గుర్తించాకే..ఈ
నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Also Read: Dhanteras 2022: సులభంగా లక్ష్మీ కటాక్షం కావాలంటే ఈ ధనత్రయోదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి