ABP Southern Rising Summit: వేర్వేరు పార్టీలు అయితే ఆత్మీయంగా పలకరించుకోకూడదా ? - ఏబీపీ సమ్మిట్‌లో కేటీఆర్, రామ్మోహన్‌నాయుడు మధ్య ఏం జరిగింది ?
Southern Rising Summit: రాజకీయ నాయకులు వేర్వేరు పార్టీల్లో ఉంటే ఆత్మీయంగా పలకరించుకోకూడదా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రారంభమయింది. దీనికి కారణం కేటీఆర్, రామ్మోహన్ పలకరింపులే.
KTR Rammohan Naidu: ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ హాట్ టాపిక్ గా మారింది. విభిన్న రంగాల నుంచి ఉద్దండులైన వారు చర్చల్లో పాల్గొన్నారు. రాజకీయ రంగం నుంచి కేటీఆర్, రామ్మోహన్ నాయుడు విడివిడిగా చర్చల్లో పాల్గొన్నారు. మొదట రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాలను చెప్పిన తర్వాత వెళ్తున్న సమయంలో కేటీఆర్ సమ్మిట్ జరుగుతున్న వేదిక వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ .. రామ్మోహన్ నాయుడును అభినదించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు.
రామ్మోహన్ నాయుడు పదవి చేపట్టిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడం కుదరలేదని ఇప్పుడు నేరుగా చెప్పానని కేటీఆర్ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు.
Haven’t had the chance to congratulate Union Civil Aviation Minister @RamMNK Garu after him assuming new role
— KTR (@KTRBRS) October 26, 2024
Greeted him & wished him the best when we met at the
#TheSouthernRisingSummit2024 pic.twitter.com/wtqMPCc7Cq
అయితే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం కొంత మంది నెటిజన్లు అన్ని పార్టీల నేతలు ఏం జరిగినా బాగానే ఉంటారని బయట కార్యకర్తలే కొట్టుకంటూ ఉంటారని ఇక నుంచి వారు కూడా మారాలని నిట్టూర్పువిడుస్తూ పోస్టులు పెడుతున్నారు.
నీకు, నీ పార్టీకి కష్టం వస్తే YSRCP సోషల్ మిడియా నీకు సపోర్ట్ గా వస్తుంది
— Gaini Devender (@GainiDevender1) October 26, 2024
2024 మీ ఓటమికి TDP కూడ పనిచేసింది
అది నీకూ తెలుసు
కాని నువ్ మాత్రం ఇలా ట్వీట్ లు వేసుకుంటూ పోతావు
ఎలా అన్నా ఇలా @KTRBRS
నీకో దండం అన్నా 🙏🙏🙏
Good luck for 2028....
సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా టీడీపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన వారు పొట్టపొట్టున తిట్టుకుంటున్నారు. వారి వారి కుటుంబాలనే కాదు.. వారి అధినేతల కుటుంబాలను కూడా ఫోటోలను మార్ఫింగ్ చేసి తిట్టుకుంటున్నారు. తాము ఇలా తిట్టుకుంటున్నాం కాబట్టి నేతలు కూడా కలవకూడదని వారి లాజిక్.
@RamMNK, this is not acceptable. You're a Central Minister and an MP representing Andhra, yet an MLA addresses you with 'Hi Raa' without showing any respect for your position. What kind of arrogance is this? How can he get away with it? Where is the #law and #order?@AmitShah https://t.co/fHsr894QQZ
— విరాట్ వీర్ (@viratveer039) October 26, 2024
నిజానికి రాజకీయ నేతలు బయట ఎన్ని విమర్శలు చేసుకున్నా వ్యక్తిగత సంబంధాల విషయంలో మాత్రం కాస్త దగ్గరగానే ఉంటారు. రాజకీయ గొడవల్ని శత్రువులుగా చేసుకోరు. కానీ సోషల్ మీడియా సైన్యాలు మాత్రం శత్రువులుగా ఉండారని కోరుకుంటాయి.