Top Headlines Today: తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్! కొండా సురేఖ వివాదాన్ని ముగిద్దామని కాంగ్రెస్ విజ్ఞప్తి - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News | తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగ చైతన్య, సమంత దంపతులపై చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. గొడవకు ముగింపు పలుకుదామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
Konda Surekha Comments | తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయమేంటీ? కేంద్రం ఏం చెబుతుంది?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో కేంద్రం ఏం చెబుతుంది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయిస్తుందనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. అందుకే అందరి చూపు ఇవాళ సుప్రీంకోర్టు వైపు ఉంది. సెప్టెంబర్ 30 లడ్డూ వివాదంపై వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన విషయాన్ని చంద్రబాబు బయటపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్‌లో సనాతన ధర్మ పరిరక్షణ రాజకీయాలు మేలుకున్నారు. డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వంద రోజుల పాటు ఆయన ఎక్కడా పెద్దగా ప్రసంగించలేదు. కనీ వంద రోజుల తర్వాత లడ్డూ ఇష్యూ తర్వాత ఆయనలోని పాత రాజకీయనాయకుడు కనిపించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొండా సురేఖ వివాదాన్ని ముగిద్దాం- సినీ ప్రముఖలకు కాంగ్రెస్ విజ్ఞప్తి
తెలుగు పరిశ్రమలో మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. కొండాసురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నందున ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని సినీ ప్రముఖులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్ హడావుడి- కూల్చివేతలపై డ్రామాలంటూ రేవంత్ ఘాటు విమర్శలు
పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని అక్రమ కట్టడాలు కూలగొట్టొద్దనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్‌లను కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు. జెన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టింది కాదా అని ప్రశ్నించారు. అది కూలగొట్టాలా వద్దో చెప్పమన్నారు. అజీజ్ నగర్‌లో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ అక్రమమా కాదా అని నిలదీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో అదానీతో పొంగులేటి, సునీల్ కనుగోలు భేటీ - రహస్య ఒప్పందాలేమిటో చెప్పాలన్న కేటీఆర్
గాంధీ జయంతి రోజున కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఓ వైపు సాగుతున్న సమయంలో మరో వైపు తెలంగాణ ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడు హైదరాబాద్‌లని ఓ స్టార్ హోటల్‌లో అదానీని కలిశారని కేటీఆర్ ఆరోపించారు. భేటీలో ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడితో పాటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నారన్నారు. అసలు వీరిమధ్య జరిగిన చర్చలేంటి.. జరిగిన ఒప్పందాలేమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి