కెనడాలో మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హతం, పెరుగుతున్న ఉద్రిక్తతలు
Sukha Duneke Killed: కెనడాలో మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హత్యకు గురవ్వడం సంచలనమవుతోంది.
Sukha Duneke Killed:
సుఖా దునేకే హత్య
ఖలిస్థాన్ వేర్పాటువాదంతో కెనడా అట్టుడుకుతోంది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హత్యకు గురవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ Arsh Dalla కి రైట్ హ్యాండ్‌గా ఉన్న సుఖా దునెకే (Sukha Duneke)హత్యకు గురయ్యాడు. గత నెల సుఖా దునేకేతో సన్నిహితంగా ఉండే మన్‌ప్రీత్ సింగ్ పీటా, మన్‌దీప్ ఫిలిప్పైన్స్ నుంచి ఇండియాకి వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే NIA ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో పంజాబ్ పోలీసులూ NIAకి సహకరించారు. పంజాబ్‌తో పాటు భారత్‌లో మరి కొన్ని చోట్ల అల్లర్లకు ప్లాన్ చేశారు. అర్స్ దల్లా వేసిన స్కెచ్ ఆధారంగా ఆందోళనలు చేపట్టాలని చూశారు. కానీ NIA ముందుగానే గ్రహించి అరెస్ట్ చేసింది. ఆ తరవాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) బంధువైన సచిన్‌నీ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితుల లిస్ట్‌లో సచిన్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. పంజాబ్‌లో Category A లిస్ట్‌లో ఉన్న సుఖా దునే హత్య మరోసారి కలకలం రేపుతోంది. 2017లో ఫేక్ పాస్‌పోర్ట్‌తో కెనడాకి వెళ్లాడు సుఖా. కెనడాలోని గ్యాంగ్‌స్టర్‌లందరితోనూ సుఖాకి సన్నిహిత సంబంధాలున్నాయి.