By: ABP Desam | Updated at : 13 Nov 2021 11:49 AM (IST)
Edited By: Murali Krishna
కేరళలో కొత్త వైరస్
కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. నోరో వైరస్ పేరుతో పిలుస్తోన్నఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. 2 వారాల వ్యవధిలో 13 కేసులు నమోదయ్యాయి. వయనాడ్ జిల్లాలోనే అన్ని కేసులు నిర్ధారణయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
Koo App#నోరోవైరస్ కేరళలోని వాయనాడ్ జిల్లాలో నోరోవైరస్ ఉన్నట్లు ధృవీకృతమైంది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు. ఇదో అత్యంత అంటు వ్యాధి. వాయనాడ్ జిల్లాలోని వైథిరీ సమీపంలోని పూకొడేలోని వెటర్నరీ కాలేజ్‌లో13 కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు ఇది సోకింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదంలేదు.- Lakshmi (@లక్ష్మి77) 13 Nov 2021
ఎలా వ్యాపిస్తోంది?
ఈ వైరస్ సోకిన వారంతా వయనాడ్ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులు. వాంతులు, డయేరియాను ఈ వైరస్ లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
పశువైద్య కళాశాల క్యాంపస్ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ)కి పంపించారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆరోగ్య మంత్రి ఆదేశించారు.
ఇవే ప్రధాన లక్షణాలు..
చికిత్స..
నోరో వైరస్‌కు ఇప్పటివరకు సరైన చికిత్స ఇది అని చెప్పడానికి లేదు. అయితే రికవరీ అనేది బాధిత వ్యక్తి రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు కొద్ది రోజుల్లోనే కోలుకుంటున్నారు. తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొదటిసారి..
1929లో తొలిసారి నోరో వైరస్‌ను గుర్తించారు. దీన్ని వాంతుల రోగంగా పిలిచేవారు. అయితే 1968లోనే దీన్ని ఓ ప్రమాదకర రోగంగా పరిగణించారు. అమెరికాలోని ఓ ఎలిమెంట్రీ పాఠశాలలో ఈ వైరస్ సోకినప్పుడు అంతా భయపడ్డారు. కానీ 1990 నుంచి మాత్రమే శాస్త్రవేత్తలు ఈ వైరస్‌పై అధ్యయనాలు మొదలు పెట్టారు.
Also Read:Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also read: Srinagar Encounter: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
కౌబాయ్ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు
World Tribal Day : 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మారని బతుకులు, ఆదివాసీల ఆవేదన
కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?
Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?
Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!
Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !