Kerala HC: 'అందుకు భర్త పర్మిషన్ అవసరం లేదు'- కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Kerala HC: అబార్షన్ చేయించుకోవడానికి మహిళ తన భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు పేర్కొంది.
Kerala HC: భర్త అనుమతి లేకుండానే యువతి తన గర్భాన్ని తొలగించుకోవచ్చని కేరళ హైకోర్టు పేర్కొంది. ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదీ కేసు
21 ఏళ్ల యువతి తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అబార్షన్ ద్వారా తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ కొట్టాయంకు చెందిన యువతి పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో గర్భిణి చట్టపరంగా విడాకులు తీసుకున్న యువతి లేదా వితంతువు కాదు.
చిత్రహింసలు
బాధిత యువతి ఓ వ్యక్తితో పారిపోయి ఆపై అతడిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత భర్త, అతడి తల్లి ఆమె పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆమె గర్భం దాల్చిన అనంతరం భర్త తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఆమెకు ఎలాంటి సాయం చేయడం లేదు.
రోజురోజుకూ భర్త, అత్త అమానుషంగా వ్యవహరిస్తుండటంతో విసిగి పోయిన యువతి తిరిగి పుట్టింటికి చేరుకుంది. అయితే గర్భాన్ని తొలగించుకునేందుకు క్లినిక్‌ను సందర్శించగా భర్తతో విడిపోయినట్టు ఎలాంటి పత్రాలు లేనందున ఆమె వినతిని వారు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధిత యువతి.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది. గర్భం తొలగించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు
Also Read: Bhagwant Mann Confidence Motion: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం- సభ నుంచి BJP వాకౌట్!