Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు
Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది.
Supreme Court on EWS Quota: సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటా (రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ తీర్పును రిజర్వ్ చేసింది.
#BREAKING: Supreme Court reserves judgement on batch of petitions challenging the 103rd Constitutional Amendment which introduced reservations for Economically Weaker Sections.#SupremeCourtOfIndia #EWSReservation #EWS pic.twitter.com/DDugz8jgiv
— Live Law (@LiveLawIndia) September 27, 2022
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఆరున్నర రోజులు
ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆరున్నర రోజల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడమంటే.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండాల్సిన పరిమితిని అది అతిక్రమిస్తోందని, క్రీమీలేయర్ విధానాన్ని ఓడిస్తోందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తుండటాన్నీ తప్పుపట్టారు.
కేంద్రం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి అనుమతించే 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అతిక్రమిస్తుందా? లేదా? విషయాన్నీ పరిశీలించింది. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చట్టం
ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. దీంతో వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: Bhagwant Mann Confidence Motion: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం- సభ నుంచి BJP వాకౌట్!
Also Read: Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!