అన్వేషించండి

Kerala Covid Scare: కేరళలో హై అలెర్ట్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు

Kerala Covid Scare: కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Kerala Covid Scare:

కీలక సమావేశం..

భారత్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదైన క్రమంలో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్‌ల హబ్‌గా మారుతున్న కేరళ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్‌గా తేలిన వారందరి వైరస్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని తేల్చి చెప్పింది. ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతోందో వీలైనంత త్వరగా గుర్తించాలని వెల్లడించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది ప్రభుత్వం. ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్‌లు ధరించాలని చెప్పింది. ప్రజలకు మరి కొన్ని జాగ్రత్తలూ చెప్పింది. "సబ్బు లేదా నీళ్లతో తరచూ చేతులు కడుక్కోండి. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని వారు...తప్పకుండా టీకాలు తీసుకోండి. ప్రికాషన్ డోస్ తీసుకోని వాళ్లు కూడా వెంటనే తీసుకోవాలి. కొవిడ్ సోకిన వాళ్ల వైరస్ శాంపిల్స్‌ని తప్పకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. అలా అయితేనే కొత్త వేరియంట్లను గుర్తించి కట్టడి చేసేందుకు వీలవుతుంది" అని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన వసతులనూ కల్పించేందుకు సిద్ధమవుతున్నారు వైద్యాధికారులు. కేరళలో డిసెంబర్‌లో కేవలం 1,431 మందికి కరోనా సోకిందని..వీరిలో కొందరు మాత్రమే ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. అయితే...ప్రభుత్వం మాత్రం "నిర్లక్ష్యం చేయకండి" అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కరోనా సోకకుండా ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ముఖమంత్రి పినరయి విజయన్ సూచించారు. 

వైరస్‌ల హబ్‌గా కేరళ..

ఏ వైరస్ వ్యాప్తి చెందినా సరే..హాట్‌స్పాట్‌గా నిలుస్తుంది కేరళ. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది ఇక్కడే. ఈ వ్యాధి మాత్రమే కాదు. గతంలో వచ్చిన ఎన్నో ఎపిడెమిక్స్‌ (Epidemics)కేరళను కలవరపెట్టాయి. డెంగ్యూ, చికున్ గున్యా, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్, వెస్ట్ నైల్ ఫివర్, H1N1,నిఫా, ఆంత్రాక్స్ సహా కొవిడ్‌. ఈ ఎపిడమిక్స్ వచ్చినప్పుడు కేరళలో చాలా మంది ఈ వ్యాధుల బారిన పడ్డారు. కేరళ ఎందుకిలా హాట్‌స్పాట్‌గా మారుతోంది..? అంటే ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సంబంధాలు ఎక్కువగా ఉండటం వల్ల. చాలా దేశాల్లో  కేరళ వాసులు నివసిస్తున్నారు. కేరళకు చెందిన వైద్యులు, నర్సులు చాలా మంది పలు దేశాల్లో పని చేస్తున్నారు. కేరళకు చెందిన విద్యార్థులు మెడికల్ కోర్సుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వాళ్లే ఎక్కువగా వైరస్‌ల బారిన పడుతుంటారు. వాళ్లు కేరళకు రాకపోకలు సాగిస్తుండటం వల్ల వైరస్‌ సులువుగా వ్యాప్తి చెందుతోంది. నేచర్ జర్నల్ వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే...కేరళలో జనాభా సాంద్రత ఎక్కువ. అందుకే..ఏ వైరస్ అయినా తొందరగా వ్యాప్తి చెందుతుంది. 

Also Read: Covid-19 Vaccine:బూస్టర్ తీసుకుంటే సరిపోతుందా, నాలుగో డోస్ కూడా అవసరమా - ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు?

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget